BRS Ex MLA Aroori Ramesh
BRS Ex MLA Aroori Ramesh : వర్దన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. నాంపల్లి రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి రమేశ్ కు పార్టీ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆరూరి రమేశ్ మాట్లాడుతూ.. వర్ధన్నపేట ఎమ్మెల్యేగా రెండు సార్లు పనిచేశానని, ప్రజలకు సేవలందించానని చెప్పారు. తెలంగాణకోసం టీఆర్ఎస్ లో చేరి.. కేసీఆర్ నాయకత్వం లో తెలంగాణ సాధించుకొని రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేశానని, ఇప్పుడు దేశంకోసం ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో పనిచేసేందుకు బీజేపీలో చేరుతున్నట్లు తెలిపారు.
Also Read : కాంగ్రెస్ పార్టీలో చేరిన రంజిత్ రెడ్డి, దానం నాగేందర్
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని ఆరూరి రమేశ్ అన్నారు. మోదీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అయోద్యలో రామ మందిరం నిర్మాణం చేశారు. ముఖ్యంగా నా జాతి అభివృద్ధికోసం బీజేపీలో చేరుతున్నట్లు ఆరూరి రమేశ్ చెప్పారు. 30ఏండ్లుగా పెండింగ్ లో ఉన్న ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణ కాబోతోందని అన్నారు. అందరితో నేను ఓ కార్యకర్తగా పనిచేసేందుకు బీజేపీలోకి వస్తున్నానని, నరేంద్ర మోదీ నాయకత్వంలో పనిచేసేందుకు నాతో వచ్చిన వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. బీజేపీలోకి ఆహ్వానించిన కిషన్ రెడ్డికి ఆరూరి రమేశ్ ధన్యవాదాలు తెలిపారు.