Dasoju Sravan Slams CM Revanth Reddy
Dasoju Sravan : తెలంగాణలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన టార్గెట్ గా బీఆర్ఎస్ నేతలు విరుచుకుపడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుంది అని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రావణ్ విమర్శించారు. అబద్దాల పునాదుల మీద రేవంత్ రాజకీయం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అహంకారమే ఆభరణంగా రేవంత్ పని చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
కనీసం దావోస్ లోనైనా రేవంత్ చిల్లరగా వ్యవహరించడం మానలేదన్నారు. సీఎం అయ్యాక కూడా రేవంత్ చిల్లర ధోరణి మారడం లేదని ధ్వజమెత్తారు. రాజకీయానికి వేదికగా రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనను వాడుకున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రతిష్టను పెంచుకోవడం కంటే కూడా వ్యక్తిగత ప్రతిష్ట పెంచుకోవడానికి రేవంత్ తాపత్రయపడ్డారని దాసోజు శ్రవణ్ అన్నారు. భాష ఎలా మాట్లాడినా పర్వాలేదు.. కానీ, భావం కూడా సరిగా లేదని విమర్శించారు.
Also Read : ఫార్ములా-ఈ రేసింగ్ గోల్‌మాల్‌పై రేవంత్‌రెడ్డి సర్కారు సీరియస్
ప్రభుత్వ ఖర్చుతో విదేశీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. రాజకీయాలు మాట్లాడి తెలంగాణ ప్రతిష్ట దిగజార్చారని బీఆర్ఎస్ నేత మన్నే క్రిశాంక్ మండిపడ్డారు. కేసీఆర్ అదానీ పెట్టుబడులను తిరస్కరిస్తే రేవంత్ తన పార్టీ సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఆహ్వానించారని ధ్వజమెత్తారాయన. గోది ఇండియా అనే కంపెనీ ఓ ఫ్రాడ్ కంపెనీ అని, నష్టాల్లో ఉన్న ఆ కంపెనీతో 8వేల కోట్ల రూపాయల ఒప్పందం రేవంత్ ఎలా కుదుర్చుకుంటారని నిలదీశారు.
తెలంగాణ సమాజానికి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు క్రిశాంక్. 22వేల కోట్ల రూపాయల దాక పెట్టుబడులు పాతవే అని చెప్పారాయన. ప్రచార ఆర్భాటానికే సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన చేశారని విరుచుకుపడ్డారు.
Also Read : తెలంగాణ ప్రజలు ఈ నెల విద్యుత్ బిల్లులు కట్టొద్దు.. ఇలా చేయండి: కేటీఆర్