చంద్రబాబు డైరెక్షన్‌లో సీఎం రేవంత్.. తెలుగుదేశం మాస్క్‌తో కాంగ్రెస్ ప్రభుత్వం: ఎర్రోళ్ల శ్రీనివాస్

తెలుగు దేశం మాస్క్ వేసుకుని తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోందని బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ హాట్ కామెంట్స్ చేశారు.

Errolla Srinivas: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ హాట్ కామెంట్స్ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు డైరెక్షన్‌లో ముఖ్యమంత్రి నడుస్తున్నారని ఆరోపించారు. శనివారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత కొద్ధి రోజులుగా పార్టీ మారే నాయకులు, అనేక పదవులు అనుభవించి పార్టీ విడుతున్నారని విమర్శించారు. కేశవరావు, కడియం శ్రీహరి పార్టీ మారుతుంటే సిగ్గనిపిస్తోందని.. వెంటలేటర్ మీద ఈ నాయకులకు ఆక్సిజన్ అందించి కేసీఆర్ బతికించారని వ్యాఖ్యానించారు. పక్కా ప్రణాళిక ప్రకారం పార్టీని మోసం చేశారని దుయ్యబట్టారు.

”కడియం శ్రీహరి ఎమ్మెల్యేగా ఉండి బిడ్డకు ఎంపీ సీట్ కావాలంటే అది కూడా ఇచ్చారు. ఇన్ని అవకాశాలు ఇచ్చిన తరవాత కూడా పార్టీని వీడి పోయారు. మీ వల్ల రాజయ్య, పసునూరి దయాకర్, ఆరూరి రమేశ్ పార్టీకి దూరమయ్యారు. కడియం ఇన్ని సంవత్సరాల అనుభవం చిల్లర రాజకీయాల కోసం వాడుకున్నారు. పార్టీ నుంచి పోయే వాళ్ల మీ పదవులకు రాజీనామా చేసి వెళ్లండి. పదవులు అనుభవించి పార్టీని విమర్శించడం సమంజసం కాదు.

గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌లో చేరినప్పుడు రాళ్లతో కొట్టి చంపండి రేవంత్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి బాధ్యత తీసుకోవాలి రాళ్లతో కొట్టించే బాధ్యత మీదే. పదవులకు రాజీనామా చేయకుండా పార్టీ మారిన నేతల ఇళ్లలో చావు డప్పు కొట్టాలని కూడా రేవంత్ అన్నారు. ఇవాళ చావు డప్పు కొట్టించే బాధ్యత కూడా మీదే. చంద్రబాబు డైరెక్షన్‌లో ముఖ్యమంత్రి నడుస్తున్నాడు. తెలుగు దేశం మాస్క్ వేసుకుని కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోంది. గతంలో టీడీపీలో ఉన్నవారంతా ఒకేవేదికపైకి వస్తున్నారు. అది రాజకీయ పునరేకీకరణ కాదు, తెలుగు తమ్ముళ్ల పునరేకీకరణ.

Also Read: కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ

తీర్దయాత్రలు చేసి మళ్లీ ఇంటికి పోతున్నామని కేశవరావు అంటున్నారు.. ఇలాంటి మాటలు సరైనవా? బీఆర్ఎస్ పార్టీ తీర్దయాత్రల్లా కనబడుతోందా? వీళ్లు రాజకీయ ద్రోహలు, తెలంగాణ ద్రోహులు. ఏ పార్టీ అధికారంలో ఉంటే అక్కడే ఉంటారు. కేకే, కడియం కేసీఆర్ పక్కన ఉండి గోతులు తవ్వారు. ఇలాంటి రాజకీయ ద్రోహులను పార్టీలోకి తీసుకోవద్దని కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనలు చేపట్టాల”ని ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు.

Also Read: బీఆర్ఎస్‌ ఖాళీ అవుతుంది.. లోక్‌స‌భ‌లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ : మంత్రి కోమటిరెడ్డి

ట్రెండింగ్ వార్తలు