బీఆర్ఎస్‌ ఖాళీ అవుతుంది.. లోక్‌స‌భ‌లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ : మంత్రి కోమటిరెడ్డి

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ , బీజేపీల మధ్యే పోటీ ఉంటుంది. రాజగోపాల్ రెడ్డి కానీ, నేను టికెట్ అడగలేదు. మా పెద్దన్న కొడుకు మాకు చెప్పకుండా దరఖాస్తు ఇచ్చారు.

బీఆర్ఎస్‌ ఖాళీ అవుతుంది.. లోక్‌స‌భ‌లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ : మంత్రి కోమటిరెడ్డి

Minister Komatireddy Venkat Reddy

Minister Komatireddy : బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుంది.. ప్రస్తుతం జరిగే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్యే పోటీ ఉంటుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన చిట్‌చాట్‌లో మాట్లాడారు. కేశవరావు, కడియం శ్రీహరిలు కాంగ్రెస్ పార్టీలో చేరికపై మాట్లాడుతూ.. కడియం నాతో ఇంకా మాట్లాడలేదు. కే.కేశవరావు మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన నేత కేకే. మా ప్రభుత్వం ను బీఆర్ఎస్ బద్నామ్ చేస్తుంది.కొత్తవాళ్లకు టికెట్ ఇవ్వడం అంటే గెలిచే వాళ్లకు ఇస్తున్నారు. పాత వాళ్లకు అన్యాయం కాదు.. మేమంతా ఉన్నాం. యాదగిరి గుట్ట పాపాలే కేసీఆర్ కు తగిలింది. బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుంటే కేసీఆర్ మైండ్ బ్లాక్ అయ్యి ఏదోదో మాట్లాడుతున్నారు. రైతు బంధు 97శాతం రైతులకు పడ్డాయి. హరీశ్ రావు సంబంధం లేకుండా మాట్లాడుతున్నాడు. తెలంగాణలో బీఆర్ఎస్ లేదు. అందుకే టికెట్ ఇచ్చినా వద్దు అని ప్రకటిస్తున్నారని కోమటిరెడ్డి అన్నారు. మేము గేట్లు తెరుచుడు కాదు.. మా గేట్లు పలగొట్టి పార్టీలో జాయిన్ అవుతున్నారు. రాబోయేకాలంలో బీఆర్ఎస్ పార్టీలో ఒక్కరూ మిగలరని మంత్రి కోమటిరెడ్డి అన్నారు.

Also Read : అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరాను: చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి

గత ప్రభుత్వంలో అన్నీ స్కాంలే..
గత ప్రభుత్వం హయాంలో అన్నీ స్కాంలే జరిగాయి. ప్రతిమ కంపెనీకి కోట్ల నిధులు ఇచ్చింది. రేపోమాపో ప్రతిమ శ్రీనివాసరావుపై విచారణ తధ్యం. 20వేల కోట్లు గత ప్రభుత్వం దోచిపెట్టిందని మంత్రి కోమటిరెడ్డి ఆరోపించారు. టానిక్ షాప్ ఐదు వేల కోట్లు స్కాం, గొర్రెల పంపిణీలో కోట్లరూపాయలు తలసాని పంచుకున్నారు. చేప పిల్లల పంపిణీలోకూడా కుంభకోణమే జరిగిందని మంత్రి విమర్శించారు. కేసీఆర్ హయాంలో జరిగిన అవినీతి మొత్తం వెలికితీయాలంటే మాకు 20ఏళ్లు పట్టేటట్లు ఉంది. అధికారం పోయేసరికి కేసీఆర్ కుటుంబ సభ్యులు తట్టుకోలేక పోతున్నారని వాళ్ల ఎమ్మెల్యేలే అంటున్నారు. మాతో 30మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రెగ్యులర్ గా మాట్లాడుతున్నారని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. తెలంగాణ పోరాటాలగడ్డ. ప్రభుత్వాన్ని కూల్చితే ప్రజలే తిరగబడతారు. బీజేపీని టచ్ చేయమనండి చూద్దాం.. వాళ్లే మా పార్టీలోకి వస్తారేమో. కేసీఆర్ హయాంలో కేటీఆర్, హరీశ్ రావు తప్ప మినిస్టర్లు ఎవరైనా ఉన్నారా? ఇంద్రకరణ్ రెడ్డి పట్టువస్త్రాలు మోయడం తప్ప చేసిదేమీలేదు. ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ లోకి వస్తున్నారు. అవినీతి రావులకోసం ఇప్పుడున్న జైళ్లు సరిపోవు. కొత్తగా జైల్ కట్టాల్సి వస్తుందేమో.. ప్రగతిభవన్ మొత్తం జైలుగా మార్చినా సరిపోదేమో అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.

Also Read : కాంగ్రెస్ గూటికి కేకే.. సీఎం రేవంత్ రెడ్డితో భేటీ.. పార్టీలో చేరిక తేదీపై చర్చ

లోక్‌స‌భ‌లో మేం టికెట్ అడ‌గ‌లేదు..
లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ , బీజేపీల మధ్యే పోటీ ఉంటుంది. రాజగోపాల్ రెడ్డి కానీ, నేను టికెట్ అడగలేదు. మా పెద్దన్న కొడుకు మాకు చెప్పకుండా దరఖాస్తు ఇచ్చారు. తెలిశాక వద్దని చెప్పా. మా అన్నదమ్ములను ఎవరూ విడదీయలేరు. రాష్ట్ర వ్యాప్తంగా నాకు, నా తమ్ముడికి ఫాలోవర్స్ ఉన్నారు. మా పేర్లు చెబితే సోషల్ మీడియాలో ట్రెండింగ్.. అందుకే మాపై రూమార్స్ వస్తున్నాయని మంత్రి అన్నారు. హైదరాబాద్ కు కళ అంటే ఆర్ఆర్ఆర్ రోడ్డు. దానికి కారణం వైఎస్ఆర్. మళ్లీ ఇప్పుడు ట్రిపుల్ ఆర్ ను కాంగ్రెస్ హయాంలో పూర్తి చేయబోతున్నాం. వైఎస్ఆర్ ప్లానింగ్ వల్లే హైదరాబాద్ అభివృద్ధి వేగంగా జరిగింది. హాలీవుడ్ లాంటి స్టూడియో పెట్టి  హైదరాబాద్ లో టూరిజం పెంచాలని చూస్తున్నాం అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.