అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరాను: చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి

కేసీఆర్ తన రాజకీయ గురువు అని, అందులో ఎటువంటి సందేహం లేదని కాంగ్రెస్ పార్టీలో చేరిన చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు.

అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరాను: చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి

MP Ranjith Reddy: బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన రాజకీయ గురువు అని, అందులో అనుమానం లేదని చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రంజిత్ రెడ్డి మాట్లాడుతూ.. తాను పార్టీ మారడం వెనుక ఎటువంటి అవకాశవాదం లేదని, అభివృద్ధి కోసమే అధికార పార్టీలోకి వెళ్లానని చెప్పారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీ మారలేదని, చేవెళ్ల ప్రజల కోసం ఎన్ని మాటలైనా పడతానని అన్నారు.

తనను రాజకీయ అవకాశవాది అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ఆయన వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ.. ”నేను పార్టీ మారడంపై కేటీఆర్ పదే పదే అవకాశవాదం అంటున్నారు. నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం వెనుక అవకాశవాదం ఏమి లేదు. అధికారం ఉంటేనే అభివృద్ధి చేయగలం. కేవలం చేవెళ్ల అభివృద్ధి కోసమే నేను కాంగ్రెస్ పార్టీలో చేరాను. ఇందులో నా వ్యక్తిగత ప్రయోజనం ఏమి లేద”ని రంజిత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

కాగా, ఇటీవల బీఆర్ఎస్ పార్టీని వీడి రంజిత్ రెడ్డి కాంగ్రెస్‌లో చేశారు. చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ఆయనను ప్రకటించింది. ఈ నేపథ్యంలో రంజిత్ రెడ్డిపై కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. బీఆర్ఎస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్‌లో చేరారని దుయ్యబట్టారు. అధికారం, ఆస్తుల కోసం బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసి కాంగ్రెస్‌లో చేరిన స్వార్థపరుడు అంటూ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.

Also Read: కాంగ్రెస్ గూటికి కేకే.. సీఎం రేవంత్ రెడ్డితో భేటీ.. పార్టీలో చేరిక తేదీపై చర్చ