Harish Rao: సీఎం రేవంత్‌ది బురద రాజకీయం.. ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారు.. హరీష్ రావు తీవ్ర ఆగ్రహం!
తెలంగాణ శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బురద రాజకీయాలకు తెరలేపారని హరీష్ రావు(Harish Rao) ధ్వజమెత్తారు.
- V Santhosh Kumar
- Published on- September 16, 2026 / 06:53 PM IST
brs leader harish rao alleges revanth reddy doing diversion politics in telangana assembly
- రేవంత్‌ది బురద రాజకీయం
- భయంతోనే ఎమ్మెల్యేల సస్పెన్షన్
- సస్పెన్షన్ తక్షణమే ఎత్తివేయాలి
Harish Rao: తెలంగాణ శాసనసభ వేదికగా ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలపై గొంతు విప్పుతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బురద రాజకీయాలకు తెరలేపారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు తానీష్ హరీష్ రావు(Harish Rao) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వం సభలో తీవ్రంగా ఎదుర్కొంటున్న కుంభకోణాలను, పరిపాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే సీఎం రేవంత్ రెడ్డి పక్కా ప్రణాళికతో డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
HiTech Bus Stand: తెలంగాణలో హైటెక్ బస్టాండ్లు.. షాపింగ్ మాల్స్, ప్లే జోన్స్.. TGSRTC సంచలన నిర్ణయం
ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానం లేకే సస్పెన్షన్:
ప్రజా సమస్యలపై తాము చేపట్టిన నిరసనలపై రేవంత్ రెడ్డి మాట్లాడినవన్నీ పచ్చి అబద్ధాలని హరీష్ రావు మండిపడ్డారు. సభలో తాము ఉంటే ప్రభుత్వ అక్రమాలు ఎక్కడ బయటపడతాయోనన్న భయంతోనే తమను కుట్రపూరితంగా సస్పెండ్ చేశారని ఆరోపించారు. రాహుల్ గాంధీ సైతం లోక్‌సభకు స్టిక్కర్ ఉన్న టీ-షర్ట్ వేసుకుని వెళ్లిన విషయాన్ని గుర్తుచేసిన ఆయన, అసెంబ్లీలో ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కు తమకు ఉందన్నారు.
సస్పెన్షన్ ఎత్తివేస్తే సభలో నిలదీస్తాం:
మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన దాడి ఘటనను ప్రశ్నించినందుకే కక్ష సాధింపుగా సస్పెన్షన్ అస్త్రాన్ని ప్రయోగించారని విమర్శించారు. అన్యాయంగా విధించిన సస్పెన్షన్‌ను తక్షణమే ఎత్తివేస్తే సభకు వచ్చి ప్రజల తరఫున నిలబడతామని స్పష్టం చేశారు. ప్రభుత్వం అబద్ధాలతో ప్రజలను మభ్యపెట్టలేదని హరీష్ రావు తేల్చి చెప్పారు.
