KTR: రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తా.. ఇప్పటికే కసరత్తు..: కేటీఆర్ ప్రకటన

పదేళ్లు రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందించామని చెప్పారు.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ సూర్యాపేట జిల్లాలో పర్యటిస్తున్నారు. ఆయనకు భారీ బైక్ ర్యాలీతో బీఆర్ఎస్ కార్యకర్తలు స్వాగతం పలికారు. అనంతరం ముఖ్య కార్యకర్తలు సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు.

Also Read: ఐపీఎల్‌లో బౌలర్లకు గుడ్‌న్యూస్‌.. ఇక రెచ్చిపోండంతే..

వచ్చే ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని తెలిపారు. పాదయాత్ర పై కసరత్తు జరుగుతోందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా తన పాదయాత్ర ఉంటుందని చెప్పారు. సూర్యాపేటలో పబ్లిక్ ను చూస్తే పెద్ద బహిరంగ సభకు వచ్చినట్లుగా ఉందని అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై వ్యతిరేకత స్టార్ట్ అయిందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్‌దే అధికారమని చెప్పారు.

దేశంలో తెలుగు వాళ్లు కూడా ఉన్నారని ఎన్టీఆర్ చాటారని, తెలంగాణ కూడా ఉందని కేసీఆర్ దేశానికి చాటారని అన్నారు. తెలుగు గడ్డపై పుట్టి దేశ రాజకీయాల్లో ప్రభావం చూపిన పార్టీలు టీడీపీ, బీఆర్ఎస్ అని తెలిపారు. కేసీఆర్ మోకాళ్ల ఎత్తు కూడా లేని కొందరు అసెంబ్లీలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని చెప్పారు.

కేసీఆర్ ఆనవాళ్లు చెరిపి వేస్తామని ఎన్ని చెప్పినా చరిత్ర మారదని, కేసిఆర్ లేకపోతే తెలంగాణ రాష్ట్రమే లేదని చెప్పుకొచ్చారు. తొలి 14 ఏళ్లు ఉద్యమ పార్టీగా రాష్ట్రాన్ని సాధించామని అన్నారు. పదేళ్లు రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందించామని చెప్పారు.

“ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వానికి చెమటలు పట్టిస్తున్నాం. ప్రజల తరఫున బీఆర్ఎస్ ప్రభుత్వంతో కొట్లాడుతుంది. పార్టీ పని అయిపోయింది.. ఇక మూత పడతది అన్నారు. కాంగ్రెస్, బీజేపీకి ఎదుర్కొని నిలబడి పోరాడుతున్నాం. చిన్న వయసులో రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. పర్సనాలిటీ పెంచుకుంటారనుకుంటే పర్సెంటేజీలు పెంచుకుంటున్నారు. కాంగ్రెస్ విష ప్రచారాలను నమ్మి ప్రజలు బీఆర్ఎస్ ను ఓడగొట్టారు” అని చెప్పారు.