BRS vs Congress Tour : కాళేశ్వరం అంటే.. ఒక్క మేడిగడ్డ మాత్రమే కాదు.. రేపు ప్రజలకు వివరిస్తాం : మాజీ మంత్రి లక్ష్మారెడ్డి

Laxma Reddy Comments : పాలమూరు ప్రజలకు కాంగ్రెస్ భరోసా ఇవ్వాలంటూ మాజీ మంత్రి లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. మేము మేడీగడ్డ పోతే.. మీరు పాలమూరు పోవడం చిన్న పిల్లల ఆట లాగా ఉందన్నారు.

BRS Leader Laxma Reddy Comments on Congress Palamuru Ranga reddy Tour

Laxma Reddy Comments : కాళేశ్వరంపై విమర్శలను తిప్పికొట్టేందుకు బీఆర్‌ఎస్ మేడిగడ్డ పర్యటనకు కౌంటర్‌‌గా కాంగ్రెస్ మరో పర్యటనకు రెడీ అయింది. పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ సందర్శనకు తెలంగాణ కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మహాబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ నేతలు రేపు (శుక్రవారం) పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును సందర్శించనున్నారు.

Read Also : Mallu Ravi Comments : కాళేశ్వరం ఎందుకు వెళ్తున్నారో బీఆర్ఎస్ నేతలు చెప్పాలి.. నిపుణుల నివేదికే ఫైనల్.. : మల్లు రవి కామెంట్స్

మరోవైపు ఛలో మేడిగడ్డకు బీఆర్‌ఎస్ కూడా పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతల పాలుమూరు పర్యటనపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి విమర్శస్త్రాలు సంధించారు. పాలమూరు వచ్చి రాజకీయం చేయొద్దని, అక్కడి ప్రజలకు భరోసా ఇవ్వాలన్నారు.

పాలమూరు ప్రజలకు భరోసా ఇవ్వండి :
‘పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ సందర్శనకు కాంగ్రెస్ నేతలు వస్తున్నారు.. చాలా సంతోషం.. నిజంగా అలానే వస్తున్నారా.. లేకపోతే మేము మేడిగడ్డ పోతున్నామని… మీరూ పాలమూరు వస్తున్నారా? అంటూ వ్యంగంగా వ్యాఖ్యానించారు.
రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మి ఓట్లు వేసి అధికారం ఇచ్చారన్న ఆయన.. పాలమూరు వచ్చి రాజకీయం చేయొద్దన్నారు.

పాలమూరు ప్రజలకు భరోసా ఇవ్వాలంటూ మాజీ మంత్రి డిమాండ్ చేశారు. మేము మేడీగడ్డ పోతే.. మీరు పాలమూరు పోవడం చిన్న పిల్లల ఆట లాగా ఉందన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరమని, అందులో మేడిగడ్డలో రెండు మూడు బారాస్‌లు కుంగాయన్నారు. అలా జరగడం చాలా దురదృష్టకరమని చెప్పారు.

మేడిగడ్డ పర్యటనలో అన్ని వివరిస్తాం :
కాళేశ్వరం అంటే.. ఒక్క మేడిగడ్డ మాత్రమే కాదన్నారు.. మేడిగడ్డ పర్యటనలో తెలంగాణ ప్రజలకు అన్ని వివరిస్తామని లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. మేడిగడ్డ జరిగిన ఘటనను బీఆర్ఎస్‌పై పదే పదే బురద జల్లే ప్రయత్న చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో 90శాతం పనులు పూర్తి చేశామని, ఇప్పుడు కాంగ్రెస్‌కు ప్రజలు అధికారం ఇచ్చారు కాబట్టి మీరు మిగిలిన పనులు పూర్తి చేయాలని మాజీ మంత్రి డిమాండ్ చేశారు.

Read Also : Dharani Guidelines : ధరణి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం మార్గదర్శకాలు.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

ట్రెండింగ్ వార్తలు