Harish Rao: సీఎం రేవంత్‌ రెడ్డికి మరోసారి కౌంటర్‌ ఇచ్చిన హరీశ్ రావు

పదవుల కోసం తామేం నోరుమూసుకుని కూర్చోలేదని హరీశ్ రావు చెప్పారు.

Harish Rao

తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్ రావు మరోసారి కౌంటర్‌ ఇచ్చారు. పదవుల కోసం తామేం నోరుమూసుకుని కూర్చోలేదని చెప్పారు. మాజీ సీఎం కేసీఆర్ సూచనలతోనే విభజన చట్టం రూపొందించారంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిన్న విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.కేసీఆరే ఈ చట్టానికి, పుస్తకానికి రచయిత అని ఆయన అన్నారు.

కృష్ణా జలాల వివాదంపై బీఆర్ఎస్ పాపాలను కాంగ్రెస్ పై నెట్టేసే కుట్రలు జరుగుతున్నాయని రేవంత్ రెడ్డి చెప్పారు. విభజన చట్టంలోని ప్రతి అక్షరాన్ని తనను అడిగే రాశారని గతంలో కేసీఆర్ చెప్పారని అన్నారు. దీంతో హరీశ్ రావు ఇవాళ మరోసారి దీనిపై స్పందించారు.

అప్పట్లో పీజేఆర్ ఒక్కరే తెలంగాణ కోసం మాట్లాడారని హరీశ్ రావు అన్నారు. తాము 2005 జులై 4న వైఎస్సార్ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చామని తెలిపారు. పదవుల కోసం తాము నోరుమూసుకుని కూర్చోలేదని అన్నారు. తెలంగాణకు కాంగ్రెస్ అన్యాయం చేస్తుందని, పదవులను గడ్డిపోచల్లా వదులుకున్నామని చెప్పారు.

తాము రాజీనామా చేసి బయటకు వచ్చిన మూడు నెలలకు పోతిరెడ్డిపాడుకు జీవో వచ్చిందని హరీశ్ రావు తెలిపారు. తాము పదవుల్లో ఉన్న సమయంలోనే జీవో వచ్చిందని రేవంత్ రెడ్డి అంటున్నారని చెప్పారు. ఆ జీవోను వ్యతిరేకంగా తాము అప్పట్లో 40 రోజుల పాటు అసెంబ్లీని స్తంభింపజేశామని అన్నారు. ప్రాజెక్టులను అప్పగిస్తూ కేసీఆర్ అప్పట్లో సంతకాలు చేసినట్లు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. కేఆర్ఎంబీ సమావేశానికి కేసీఆర్ హాజరేకాలేదని చెప్పారు.

Chandrababu Naidu: చంద్రబాబు హెలికాప్టర్ ల్యాండింగ్‌కు అనుమతి నిరాకరణ.. హెలిప్యాడ్ మధ్యలో తవ్వకాలు