Site icon 10TV Telugu

మా తరహాలో ఇలా బీజేపీ, మిగతా పార్టీల నాయకులు సాయం చేయడానికి ముందుకు రావాలి: హరీశ్ రావు

BRS MLA Harish Rao

సిద్దిపేట జిల్లాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఖమ్మం వరద బాధితులకు సరకులు పంపే వాహనాలను మాజీ మంత్రి హరీశ్ రావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల నెల వేతనాన్ని వరద బాధితులకు అందిస్తున్నామని చెప్పారు.

తమ తరహాలో బీజేపీ, మిగతా పార్టీల నాయకులు సాయం చేయడానికి ముందుకు రావాలని హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట నుంచి ఉడతా భక్తిగా సాయం చేస్తున్నామని చెప్పారు. మానవ సేవయే మాధవ సేవ అని అందరూ ముందుకు వచ్చి వరద బాధితులకు సాయం చేయాలని అన్నారు.

తాము వరద సాయం చేయడానికి ఖమ్మం వెళ్తే తమపై దాడి చేసి కేసులు నమోదు చేస్తున్నారని, అక్కడి ప్రజలు ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారని హరీశ్ రావు చెప్పారు. రాష్ట్రంలో ప్రజా పాలనా కాకుండా రాక్షస పాలన నడుస్తోందని అన్నారు. ముందుగా ప్రభుత్వం మేలుకుంటే మరింత ప్రాణ నష్టాన్ని తగ్గించే అవకాశం ఉండేదని చెప్పారు. సీఎం చేస్తున్న తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడని అన్నారు. తమకు వస్తున్న స్పందనను చూసి ఓర్వలేకనే దాడులు చేస్తున్నారని చెప్పారు.

Also Read: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎన్‌కౌంటర్.. ఆరుగురు మావోల మృతి

Exit mobile version