భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎన్‌కౌంటర్.. ఆరుగురు మావోల మృతి
మృతుల్లో మణుగూరు ఏరియా కమిటీ కార్యదర్శి లచ్చన్న ఉన్నట్లు సమాచారం.
మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం రఘునాథపాలెం వద్ద అటవీప్రాంతంలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. దీంతో, పోలీసులు జరిపిన కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టుల మృతిచెందారు.
ఇద్దరు భద్రతా బలగాలకు కూడా తీవ్రగాయాలయ్యాయి. మృతుల్లో మణుగూరు ఏరియా కమిటీ కార్యదర్శి లచ్చన్న ఉన్నట్లు సమాచారం. ఆ ప్రాంతంలో ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. సరిహద్దు జిల్లాల గ్రామాల ప్రజలు తూటాల మోతలతో భయం గుప్పెట్లో ఉన్నారు. ఎన్‌కౌంటర్‌పై పూర్తి సమాచారం అందాల్సి ఉంది.
కాగా, బుధవారం ఛత్తీస్‌గఢ్, దంతేవాడ జిల్లాలోనూ కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఇందులో హనుమకొండ జిల్లాకు చెందిన మావోయిస్టు అగ్రనేత ఏసోబు అలియాస్ ఎల్లన్న అలియాస్ జగన్ (71) మృతి చెందాడు.
Also Read: హృదయాన్ని ద్రవింపజేస్తున్న తండ్రీకూతుళ్ల స్టోరీ