Site icon 10TV Telugu

Malla Reddy: అసలు రాజకీయాలే వద్దనుకుంటున్నా.. ఏ వైపు చూసేటట్లు లేదు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు

Malla Reddy

Malla Reddy

Malla Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను బీజేపీ వైసా, టీడీపీ వైపా, బీఆర్ఎస్ వైపా అన్నది కాదని.. ఇప్పుడు తాను బీఆర్ఎస్ లో ఉన్నానని, ఇకపై ఏ పార్టీ వైపు చూసేటట్టు కూడా లేదన్నారు. అసలు రాజకీయాలే వద్దనుకుంటున్నానని ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రజలకు సేవ చేసేందుకు మంచి కాలేజీలు, యూనివర్సిటీలు నడిపిద్దామనుకుంటున్నానని మల్లారెడ్డి తన మనసులో మాటను బయటపెట్టారు.

”నేనిప్పుడు ఏ వైపూ చూసేటట్లు కూడా లేను. నాకు కూడా 73 సంవత్సరాలు. ఇక ఏవైపు చూడాల్సిన అవసరం ఏముంది? నేను ఎంపీ అయ్యాను, మినిస్టర్ అయ్యాను, మళ్లీ ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యా.. ఇంకా మూడేళ్లు ఉంటా. నేను రాజకీయమే వద్దనుకుంటున్నా. ప్రజలకు సేవ చేసి మంచి పేరు తెచ్చుకోవాలని అనుకుంటున్నా.

దేశంలో వరల్డ్ క్లాస్ డాక్టర్లను తయారు చేయాలన్నా మా మల్లారెడ్డి హాస్పిటలే వస్తుంది. వరల్డ్ క్లాస్ ఇంజినీర్లు కావాలన్నా, వరల్డ్ క్లాస్ మేనేజ్ మెంట్ కావాలన్న, ప్రజలకు సేవ చేయాలన్నా ఆ అదృష్టం అంతా నాకే కల్పించినందుకు ఆ దేవుడికి, మా ప్రజలకు చాలా చాలా ధన్యవాదాలు” అని మల్లారెడ్డి అన్నారు.

”నాకు దేవుడు అన్నీ ఇచ్చాడు. నేను ప్రజలకు సేవ చేయాలి. అక్కడ మంచి ఇంజినీర్లు, డాక్టర్లను తయారు చేయాలి. ఈ రెండు నా లక్ష్యం. భవిష్యత్తులో దేశం మొత్తం డీమ్డ్ యూనివర్సిటీలు పెట్టాలని అనుకుంటున్నా. నోయిడాలో ఒకటి ఫైనల్ అయ్యింది. లక్నోలో కూడా 50 ఎకరాల్లో పెద్ద హెల్త్ డిజిటల్ హెల్త్ సిటీ పెడదామని ప్లాన్ చేస్తున్నాం. బీహార్, బెంగాల్, ఏపీ ఇలా దేశవ్యాప్తంగా మెయిన్ మెయిన్ సిటీస్ లో యూనివర్సిటీలు తెరుద్దామని ప్లాన్ చేస్తున్నాం. వైజాగ్, కర్నూల్ లోనూ ప్లాన్ చేస్తున్నాం. అందరికీ వైద్యం, విద్య అందివ్వాలని ఇవన్నీ ప్లాన్ చేస్తున్నాం”

Also Read: వైఎస్ జగన్, కేటీఆర్ ఇళ్లలో కనిపించని రాఖీ పండగ వాతావరణం.. అన్నలకు రాఖీ కట్టని కవిత, షర్మిల.. కారణం అదేనా..

 

Exit mobile version