KCR Jagan: వైఎస్ జగన్, కేటీఆర్ ఇళ్లలో కనిపించని రాఖీ పండగ వాతావరణం.. అన్నలకు రాఖీ కట్టని కవిత, షర్మిల.. కారణం అదేనా..
కొన్నాళ్లుగా కుటుంబ తగాదాలు, ఆస్తుల పంచాయితీ ఓ రేంజ్ లో నడుస్తోంది. మీడియా ముందు ప్రెస్ మీట్ లతో బహిరంగంగానే వీరిద్దరి మధ్య జరుగుతున్న ఈ ఆస్తుల పంచాయితీ కోర్టుల దాకా వెళ్లడంతో

KCR Jagan: తెలుగింట రాఖీ పండగ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. ప్రతీ ఇంట సోదరులకు సోదరీమణులు రాఖీలు కడుతూ తమ మధ్య ఉన్న అనుబంధాలను గుర్తు చేసుకుంటున్నారు. కానీ, తెలుగు రాష్ట్రాల్లో ఓ రెండిళ్లలో మాత్రం పండగ బోసిపోతోంది. వారే వైసీపీ అధినేత వైఎస్ జగన్, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వీరిద్దరి ఇళ్లలో రాఖీ పండగ వాతావరణం కనిపించడం లేదు.
సొంత చెల్లెళ్లతో రాఖీ కట్టించుకోలేని పరిస్థితి వారికి ఎదురైంది. రాఖీ పండగ వేళ కేటీఆర్ ప్రస్తుతం బెంగళూరులో బిజీగా ఉన్నట్లు సమాచారం అందగా, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ ఎన్నికల్లో ఓటమి తర్వాత బెంగళూరు నుంచే అమరావతికి రాకపోకలు సాగిస్తున్నారు. ఈ రెండు కుటుంబాల్లో కొంత కాలంగా పొలిటికల్ కుంపట్లు రాజుకుంటున్నాయి. దీంతో ఈ రెండు కుటుంబాల్లోని అన్నా చెల్లెళ్ల మధ్య అస్సలు పొసగడం లేదంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ కు, తన సోదరి షర్మిలకు కొన్నాళ్లుగా కుటుంబ తగాదాలు, ఆస్తుల పంచాయితీ ఓ రేంజ్ లో నడుస్తోంది. మీడియా ముందు ప్రెస్ మీట్ లతో బహిరంగంగానే వీరిద్దరి మధ్య జరుగుతున్న ఈ ఆస్తుల పంచాయితీ కోర్టుల దాకా వెళ్లడంతో అన్నా చెల్లి మధ్య ఉన్న వైరం రోజురోజుకి పెరిగిపోతోంది.
దీంతో ఒకరి ముఖం మరొకరు చూసుకోలేని పరిస్థితి ఏర్పడుతోందన్న వాదనలు పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. గత ఐదేళ్లుగా వైఎస్ జగన్, షర్మిల రాఖీ పండగ జరుపుకోలేదు. ఈసారి కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యింది.
ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విషయానికి వస్తే గతేడాది లిక్కర్ కేసులో ఢిల్లీ జైలు నుంచి బయటకు వచ్చిన కవిత కేటీఆర్ ఇంటికెళ్లి రాఖీ కట్టారు. 2024లో ఇంతవరకు బాగానే ఉన్నా 2025లో మాత్రం కల్వకుంట్ల కుటుంబంలో వస్తున్న కలహాలు కవిత, కేటీఆర్ మధ్య గ్యాప్ కు కారణమైందన్న వాదనలు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి.
మరీ ముఖ్యంగా మూడు నాలుగు నెలలుగా కవిత గులాబీ పార్టీతో అంటీముట్టన్నట్లు వ్యవహరిస్తుండటమే కాదు.. జాగృతి పేరుతో జోరుగా సొంత కార్యక్రమాలు నిర్వహిస్తుండటంపై పార్టీ అధినేత కూడా కొంత గుర్రుగా ఉన్నట్లు సమాచారం. అందుకే గులాబీ పార్టీ కూడా కవితతో కొంత గ్యాప్ మెయింటైన్ చేస్తోందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.
సరిగ్గా ఇలాంటి సందర్భంలో ఇప్పుడు రాఖీ పండగ వచ్చింది. కేటీఆర్ ఉన్నట్లుండి బెంగళూరు పర్యటనకు వెళ్లారు. అయితే రాఖీ పండగ వేళ కవిత మనసులో ఏముందో అటు కేటీఆర్ మనసులో ఏముందో ఎవరికి తెలుసన్న చర్చ నడుస్తోంది. అన్న కేటీఆర్ కు రాఖీ కట్టేందుకు కవిత సుముఖంగా లేరా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
రాఖీ పండగ రోజున బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మనస్తాపానికి గురయ్యారు. ప్రతీ ఏటా తన సోదరుడు కేటీఆర్ కు రాఖీ కడుతున్నారు కవిత. అయితే, ఈ ఏడాది కేటీఆర్ తెలంగాణలో లేకపోవడంతో ఆమె రాఖీ కట్టలేకపోయారు. అయితే, తాను వస్తానని కేటీఆర్ కు నిన్ననే మేసేజ్ చేశారు కవిత. అయితే కేటీఆర్ మాత్రం నిన్న లగచర్ల బాధితులతో రాఖీ కట్టించుకున్నారు. అనంతరం బెంగళూరు వెళ్లిపోయారు. బెంగళూరు చేరుకున్న తర్వాత కవిత మెసేజ్ కు రిప్లయ్ ఇచ్చారు. తాను ఔటాఫ్ స్టేషన్ అంటూ మెసేజ్ చేశారు. దీంతో రాఖీ రోజున కవిత తన ఇంట్లోనే ఉండిపోయారు.
రేపు ఇంటికి వస్తాను, రాఖీ కడతాను అంటూ కవిత నిన్ననే కేటీఆర్ కు మేసేజ్ చేసినా.. బెంగళూరు చేరుకున్న తర్వాత కేటీఆర్ కవిత మేసేజ్ కు రిప్లయ్ ఇచ్చారు. తాను ఔటాఫ్ స్టేషన్ అని చెప్పారు. దీంతో చేసేదేమీ లేక రాఖీ పండగ రోజున కవిత తన ఇంటికే పరిమితం అయ్యారు. రాఖీ పండగ రోజున కవిత మనస్తాపం చెందినట్లుగా తెలుస్తోంది.
Also Read: ఎన్నిక ఏదైనా వైసీపీని వెంటాడుతున్న ఆ కేసు.. ఈసారి ఎంత డ్యామేజ్ చేస్తుందో అని టెన్షన్..!