Gossip Garage: ఎన్నిక ఏదైనా వైసీపీని వెంటాడుతున్న ఆ కేసు.. ఈసారి ఎంత డ్యామేజ్ చేస్తుందో అని టెన్షన్..!
ఇప్పటికే నేతల అరెస్ట్, లిక్కర్ స్కామ్ ఎపిసోడ్‌తో ఎన్నో ట్రబుల్స్ ఫేస్ చేస్తోంది వైసీపీ. ఇదే సమయంలో..

Gossip Garage: ఒక్క జడ్పీటీసీ బైపోల్. ఎన్నో విమర్శలు..మరెన్నో డైలాగ్ వార్స్..ఇలా ఏపీ రాజకీయమంతా పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక చుట్టే తిరుగుతోంది. దాడులు..పరస్పర ఫిర్యాదులు..పోటాపోటీ ర్యాలీలతో రచ్చరంబోల అవుతోంది. ఈ పొలిటికల్ హడావుడి ఇలా ఉండగానే..బాబాయ్ మర్డర్ ఇష్యూ వైసీపీకి మరోసారి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. పులివెందుల సమరంలో ఎవరెంత దూరం? సునీత కామెంట్స్ ఫ్యాన్ పార్టీకి హెడెక్‌గా మారాయా? ఎందుకీ పొలిటికల్ హైటెన్షన్?
పులివెందుల. ఈ పేరు వింటేనే జగన్ కంచుకోట అన్న టాక్ వినిపిస్తుంటుంది. వైఎస్ ఫ్యామిలీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి పులివెందులలో వాళ్లదే హవా. కానీ ఫస్ట్ టైమ్ ఇప్పుడు పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక ఓ రేంజ్‌లో హీట్ క్రియేట్ చేస్తోంది. టీడీపీ వైసీపీని ఓడించి తీరుతామన్న పట్టుదలతో ఉంది. అందుకు తగ్గట్లే పొలిటికల్ డెవలప్‌మెంట్స్ కనిపిస్తున్నాయి.
వైసీపీ నేతల చేరికలతో పాటు..ప్రచారంలో దూసుకెళ్తోంది. ఓవైపు అధికారం..బలమైన అభ్యర్థి, ఆర్థిక అంగ బలాలు అన్నీ టీడీపీకి ఉన్నాయి. వైసీపీకి, జగన్‌కు పులివెందుల ఎంత కంచుకోట అయినా ఇప్పుడు ఆ పార్టీ అపోజిషన్‌లో ఉంది. వైసీపీ నేతలెవరు పెద్దగా ప్రచారం చేయడానికో లేక కూటమిని ఢీ కొట్టడానికో ముందు రావడం లేదన్న చర్చ జరుగుతోంది. రెండు రోజుల క్రితం జరిగిన గొడవలతో పరస్పర ఫిర్యాదులు..తమ ఎమ్మెల్సీపై దాడి చేశారని వైసీపీ కంప్లైంట్లు హాట్ టాపిక్ అయ్యాయి. గాయపడ్డారని చెబుతున్న నేతలను ఏకంగా వైసీపీ అధినేత జగన్ ఫోన్‌లో పరామర్శించారు. పైగా ఎంపీ అవినాశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ సతీష్‌రెడ్డి మీద పూర్తి భారం మోపి..ఈ జడ్పీటీసీ బైపోల్‌లో గెలిచేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది వైసీపీ.
వైసీపీకి పెట్టని కోటగా చెప్పుకునే పులివెందులలో ఒక జడ్పీటీసీ ఉపఎన్నిక..వైసీపీ అధినేతకు, ఆ పార్టీకి బిగ్ సవాల్‌గా మారింది. టీడీపీ అధికారంలో ఉండడంతో పాటు ఆ పార్టీ పులివెందుల ఇంచార్జ్ బీటెక్ రవి భార్య లతారెడ్డి అభ్యర్థి కావడంతో పోటీ మరింత కాక రేపుతుంది. బీటెక్ రవి గతంలో వైఎస్ వివేకా మీద ఎమ్మెల్సీగా గెలిచారు. ఇప్పుడు ఆయన సతీమణిని అభ్యర్థిగా పెట్టి..జగన్ సొంత ఇలాకాలో టీడీపీ జెండా ఎగరవేసే స్కెచ్ వేస్తున్నారు.
రాష్ట్ర స్థాయి టీడీపీ పెద్దలు కూడా పులివెందులపై ఫోకస్ పెట్టారు. దాంతో పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక గెలుపు ఎవరికీ అంత ఈజీ కాదన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఈ జడ్పీటీసీ బైపోల్‌లో కూడా బాబాయ్ మర్డర్ ఎపిసోడ్ వైసీపీని వదిలి పెట్టడం లేదు. వివేకానందరెడ్డి హత్య కేసు మళ్ళీ చర్చనీయాంశం అవుతోంది. ప్రత్యర్ధులు అస్త్రంగా మల్చుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇది వైసీపీకి ఇబ్బందిగా మారుతోంది. మరోవైపు వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడు సునీల్ యాదవ్ కూడా అభ్యర్ధిగా బరిలో ఉన్నారు. కాంగ్రెస్ తరఫున షర్మిల సన్నిహితుడు పోటీ చేస్తున్నారు. వీళ్లిద్దరు ఓట్లు చీలిస్తే మాత్రం వైసీపీ ఎక్స్‌పెక్ట్ చేసిన రిజల్స్ట్ రాకపోవచ్చన్న టాక్ వినిపిస్తోంది.
పులివెందుల జడ్పీటీసీ బైపోల్ వేళ వివేకానందరెడ్డి కూతురు సునీత చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. కడప ఎస్పీని కలిసిన ఆమె.. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక ప్రచారంలో పరిణామాలపై భయాందోళన వ్యక్తం చేశారు. తన తండ్రి వివేకాను హత్య చేసి గుండెపోటుగా నమ్మించారని..టీడీపీ నేతలు చంపించారని నమ్మబలికారని సునీత చెప్పుకొచ్చారు. అంతేకాదు హత్య తర్వాత ఓ లేఖ తెచ్చి తన నాన్నను ఆదినారాయణరెడ్డి, సతీశ్ రెడ్డి, బీటెక్ రవి చంపినట్లు సంతకం చేయాలని కోరితే తాను సైన్ చేయలేదంటున్నారు.
ఇప్పటికే నేతల అరెస్ట్, లిక్కర్ స్కామ్ ఎపిసోడ్‌తో ఎన్నో ట్రబుల్స్ ఫేస్ చేస్తోంది వైసీపీ. ఇదే సమయంలో పులివెందుల జడ్పీటీసీ బైపోల్ వచ్చింది. ఈ ఎన్నికలో గెలిచి పరువు నిలబెట్టుకోవాలనే ఫ్యాన్ పార్టీ ప్రయత్నిస్తుంటే..వైఎస్ సునీత ఎంట్రీ..వివేకా హత్య కేసును ప్రస్తావిస్తూ టీడీపీ విమర్శలు చేయడం వైసీపీని కలవర పెడుతోంది.
2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమికి వివేకా హత్య కేసు ఆరోపణలు ఓ కారణమన్న చర్చ ఉండే ఉంది. ఇప్పుడు పులివెందుల జడ్పీటీసీ బైపోల్‌లో..వివేకా హత్య ఇష్యూ..ఎంత డ్యామేజ్ చేస్తుందోనని వైసీపీ టెన్షన్ పడుతోందట. ఇలా వైసీపీని వివేకా కేసు వెంటాడుతూనే ఉంది. సందర్భంగా ఏదైనా ప్రత్యర్ధులు వివేకా హత్య కేసును లైమ్‌లైట్‌లో ఉంచే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇది వైసీపీకి ఇరకాటంగానే ఉంటుంది. రాజకీయ ప్రత్యర్ధులతో పోరాటంలో ఎక్కడా తగ్గని వైసీపీ.. వివేకా హత్య కేసు రూపంలో వస్తున్న ఇబ్బందులకు సొల్యూషన్ వెతుక్కోలేకపోతోంది. వివేకా హత్య ఎపిసోడ్..పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో ఎంత ప్రభావం చూపిస్తుందో వేచి చూడాలి.
Also Read: ఏపీ రాజధాని అమరావతికి రాజముద్ర, చట్టబద్ధత ఇంకెప్పుడు..?