Amaravati: రాజధానికి రాజముద్ర.. చట్టబద్ధత ఇంకెప్పుడు..?

అమరావతికి ఆమోద ముద్ర కోసం ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లారని వారు కూడా సానుకూలంగా ఉన్నారని చెబుతున్నారు. వన్స్ రాజధానికి ఆమోద్రపడితే ఇక..ఫ్యూచర్‌పై కన్‌ఫ్యూజన్‌ ఉండదని..ఎవరు పవర్‌లో ఉన్నా క్యాపిటల్‌ జోలికి వచ్చే అవకాశం ఉండదని భావిస్తున్నారు.

Amaravati: రాజధానికి రాజముద్ర.. చట్టబద్ధత ఇంకెప్పుడు..?

Updated On : August 8, 2025 / 7:25 AM IST

ఏపీ రాజధాని అమరావతే. ఏపీ ప్రజలకు అయితే క్లారిటీ ఉంది. కానీ ఎక్కడో చిన్న లోటు ఉంది. అదే రాజధానికి రాజముద్ర లేకపోవడం. ఇప్పుడదే అతిపెద్ద వెలితిగా కనిపిస్తోంది. వన్స్ ఏపీ రాజధాని అమరావతే అని కేంద్రం గెజిట్‌ ఇస్తే..ఇన్వెస్టర్స్‌ రావొచ్చు. రైతులు భూములు ఇచ్చేందుకు కూడా రెడీగా ఉన్నారు. స్టేట్‌ క్యాపిటల్‌గా అమరావతి హాట్‌ పాయింట్‌ అవడం పక్కా. కానీ నవ్యాంధ్ర రాజధానిగా అమరావతిని ప్రకటించి పదేళ్లు అయినా అధికార ముద్ర లభించడం లేదు. వైసీపీ మూడు రాజధానుల రాగంతో ఆ ఐదేళ్లు అమరావతి ప్రభ కనుమరుగైంది. ఇక అమరావతే క్యాపిటల్‌ అని కూటమి అంటోంది.

ఏంటీ కన్ఫ్యూజన్. ఇలా అయితే అభివృద్ధి అయ్యేదెప్పుడు.? అన్న చర్చ జరుగుతోంది. అయితే అమరావతే రాజధాని అని క్లియర్‌ కట్ క్లారిటీ రావాలంటే గెజిట్‌ రావాలని..అప్పుడే చట్టబద్ధత ఏర్పడి..రాజధాని ఫ్యూచర్‌కు ఢోకా ఉండదంటున్నారు. అయితే అమరావతే రాజధాని అంటూ పదకొండేళ్ల క్రితం శంకుస్థాపనలు చేశారు. అమరావతి పునర్ నిర్మాణ పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఈ పదకొండేళ్ల కాలంలో చర్చ మొత్తం అమరావతి చుట్టే తిరుగుతున్నా..రాజధానికి మాత్రం చట్టబద్ధత దక్కడం లేదు.

Also Read: భారత్‌పై ట్రంప్‌ టారిఫ్‌లు విధించిన వేళ.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఎన్ఎస్ఏ అజిత్ ఢోభాల్ కీలక భేటీ

ఒక రాష్ట్రానికి ఫలానా నగరం లేదా పట్టణం ప్రధాన నగరమని కేంద్రం గుర్తించాలి. ఆ ముఖ్యపట్టణం రాజధాని అవుతుంది. పాలనాపరంగా అక్కడ నుంచే వ్యవహారాలు నడుస్తుంటాయి. అలా దేశంలో ప్రతీ రాష్ట్రానికీ రాజధానిని కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ ద్వారా గుర్తించింది. కానీ ఏపీలో అమరావతికి మాత్రం ఆ గుర్తింపు అయితే ఇప్పటిదాకా లేదు. పదేళ్లు దాటిపోతున్నా అమరావతి ఒక రాజధానిగా అధికారిక గుర్తింపును పొందలేకపోయింది. కేంద్రంలో ఎన్డీయే ఉంది.

రాష్ట్రంలో కూడా ఎన్డీయే ప్రభుత్వం ఉంది. ఇలా డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్నా..ఏపీ రాజధానిగా అమరావతికి అధికార హోదా దక్కడం లేదు. ఇలా ఎందుకు జరుగుతోంది అన్నదే చర్చగా ఉంది. కేంద్రంలో నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి ఏపీలోని టీడీపీ ఎంపీల మద్దతు చాలా కీలకం. మరి అమరావతి ఏపీ రాజధాని అన్న గెజిట్ నోటిఫికేషన్ రావడానికి ఎక్కడ ఏ స్థాయిలో ఆలస్యం అవుతోంది క్లారిటీ లేదు. 2014 నుంచి 19 వరకు టీడీపీ ప్రభుత్వమే ఉన్నప్పటికీ అమరావతికి రాజముద్ర కోసం చేసిన ప్రయత్నాలు పెద్దగా ముందుకు సాగలేదు.

భూసేకరణకు ఎలాంటి అభ్యంతరాలు లేవంటున్న రైతులు
అప్పుడు కేంద్రంలో బీజేపీకి ఫుల్ సపోర్ట్ ఉండటంతో డిమాండ్ చేసే పరిస్థితి కూడా లేకుండాపోయింది. తర్వాత 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ మూడు రాజధానుల మాటతోనే కాలం వెళ్లదీసింది. దీంతో అమరావతి కల తప్పిందన్న టాక్ ఉంది. 2024లో పవర్‌లోకి వచ్చిన కూటమి మళ్లీ అమరావతి మీద ఫోకస్ పెట్టింది. తిరిగి రాజధాని పునర్‌ నిర్మాణ పనులు స్టార్ట్‌ చేసింది. అయినా రాజముద్ర మీద ఇంకా ప్రకటన రాకపోవడం ఏంటో ఎవరికి అర్థం కావడం లేదు.

అమరావతి రైతులు కూడా ఇంకా భూములు కావాలంటే ఇస్తాం..కానీ అధికార ముద్రపడేలా చూడాలని కోరుతున్నారు. రెండో విడత భూసేకరణకు తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవంటున్న రైతులు..అమరావతిని ఏపీకి శాశ్వత రాజధానిగా అధికారికంగా గుర్తించాలని అంటున్నారు. అయితే ఈ మధ్యే గుంటూరులో పర్యటించిన ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ పీవీఎన్ మాధవ్‌ను కలిసి కూడా రైతులు గెజిట్‌ నోటిఫికేషన్‌ కోసం విజ్ఞప్తి చేశారు. అమరావతికి రాజముద్ర దక్కేలా చూస్తామని ఆయన మాట ఇచ్చారు.

సీఎం చంద్రబాబు కూడా ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు ఫాలో కావాల్సిన ప్రొసీజర్స్‌ అన్నింటినీ ఫాలో అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అమరావతికి ఆమోద ముద్ర కోసం ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లారని వారు కూడా సానుకూలంగా ఉన్నారని చెబుతున్నారు. వన్స్ రాజధానికి ఆమోద్రపడితే ఇక..ఫ్యూచర్‌పై కన్‌ఫ్యూజన్‌ ఉండదని..ఎవరు పవర్‌లో ఉన్నా క్యాపిటల్‌ జోలికి వచ్చే అవకాశం ఉండదని భావిస్తున్నారు. రాజధానికి రాజముద్ర పడేదెప్పుడో..చూడాలి మరి.