Kaushik Reddy
Padi Kaushik Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రూప్ -1లో అతిపెద్ద కుంభకోణం జరిగిందని ఆయన ఆరోపించారు. 21,093 పరీక్షా రాస్తే 21,103 ఫలితాలు ఎలా ఇచ్చారని కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. 10మంది అదనంగా ఎలా వచ్చిందో చెప్పలేదన్నారు. పరీక్ష రాసిన వాళ్ళకంటే ఎక్కువ రిజల్ట్ ఇస్తారా? అని నిలదీశారు. ఉర్దూ మీడియంలో మొదటగా 09మంది అని అన్నారు, ఆ తర్వాత 10మంది అని చెబుతున్నారు. ఆ ఒక్కరు ఎలా పెరిగారో చెప్పాలని పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు.
”UPSC లో ప్రిలిమ్స్ కు ఒక హాల్ టికెట్ నెంబర్, మెయిన్స్ కు మరో హాల్ టికెట్ ఉండదు. మరి ఇక్కడ మాత్రం వేరువేరుగా ఎలా ఇచ్చారు? కమిషన్లు తీసుకుని ఫలితాలు ఇచ్చారు. 438 సిరీస్ లో ఉన్న వారందరికీ ఒకే మార్కులు ఎలా వస్తాయి? రాములు నాయక్ చెప్పిన మాట మీద ఉండాలి. నిరూపిస్తే గుండు కొట్టుకుంటా అన్నారు. మాట మీద నిలబడాలి.
Also Read : జైలు తప్పదు.. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం.. ప్రభుత్వంపై సుప్రీంకోర్టు సీరియస్..
రాములు నాయక్ కోడలికి మల్టీ జోన్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. రాములు నాయక్ 18 గంటలు చదివారని చెప్తుంటే.. కోడలు 5 గంటలు చదివానని చెప్తుంది. ఇద్దరిలో ఎవరు చెప్పేది నిజం? కోఠి ఉమెన్స్ కాలేజ్ లో అమ్మాయిలు మాత్రమే పరీక్ష రాశారు? ఈ సెంటర్ లో పక్కా స్కామ్ జరిగింది. ఈ ప్రభుత్వం ఫెయిల్యూర్ అయ్యింది. స్కామ్ లు చేస్తోంది.
Also Read : భూభారతి రూల్స్ ఇవే.. మీ భూ రికార్డుల్లో తప్పులుంటే ఏం చేయాలి..? పూర్తి వివరాలు ఇలా..
బండి సంజయ్ ఎందుకు నోరు విప్పడం లేదు? నిరుద్యోగుల మీద ప్రేమ ఉంటే సీబీఐ విచారణ జరపాలి. రేవంత్ రెడ్డితో లాలూచీ పడ్డారు. కాంగ్రెస్, బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తున్నాయి. బీజేపీ వాళ్ళకి ముల్లెలు ముడుతున్నాయి. జుడీషియల్, సీబీఐ విచారణ జరపాలి. గ్రూప్ వన్ ని రద్దు చేయాలి” అని పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు.
మరిన్ని ఇంట్రస్టింగ్ స్టోరీలు, అప్‌డేట్స్ కోసం 10టీవీ వాట్సాప్ చానల్‌ని ఫాలో అవ్వండి.. Click Here