కేసీఆర్‌కు మరో షాక్‌.. కాంగ్రెస్‌లో చేరడానికి సిద్ధమైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే

ఇప్పటికే కాంగ్రెస్‌లో ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం..

రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత ప్రకాశ్ గౌడ్ కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. రేపోమాపో తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ లో చేరతానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రకాశ్ గౌడ్ తెలిపారు. రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్‌లో చేరనున్నారు.

ఇప్పటికే కాంగ్రెస్‌లో ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ కి షాక్ ఇస్తూ ప్రకాశ్ గౌడ్ కూడా అదే బాటలో పయనిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం కూడా రేవంత్ రెడ్డిని ప్రకాశ్ గౌడ్ కలిశారు. పార్టీలో చేరే విషయంలో ఇప్పుడు ప్రకాశ్ గౌడ్ తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డితో పలువురు బీఆర్ఎస్ నేతలు వరుసగా సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది. ఒక్కొక్కరూ బీఆర్ఎస్ ను వీడుతూ కాంగ్రెస్ లో చేరుతుండడంతో గులాబీ పార్టీలో గుబులు పుట్టిస్తోంది.

Also Read: దెందుటూరుపై బీజేపీ గాలం.. దెందులూరు వదులుకోవడంపై టీడీపీ టెన్షన్!

ట్రెండింగ్ వార్తలు