Khanapur MLA Rekhanayak: పార్టీ మారడం ఖాయం.. కాంగ్రెస్ టికెట్‌కోసం దరఖాస్తు చేసుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖానాయక్

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఆశావహుల నుంచి గాంధీ భవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ధరఖాస్తు‌లను స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఐదు రోజుల్లో 280 ధరఖాస్తులు వచ్చాయి.

BRS MLA Rekhanayak

BRS MLA Rekhanayak : తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల యుద్ధానికి సీఎం కేసీఆర్ సన్నద్ధమయ్యారు. ఈ మేరకు సోమవారం అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల పేర్లను వెల్లడించారు. ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ స్థానంలో జాన్సన్ రాథోడ్ నాయక్‌కు చోటు కల్పించారు. దీంతో ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఆమె భర్త శ్యామ్ నాయక్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. నేడోరేపో రేఖానాయక్ సైతం పార్టీ మారుతుందని ప్రచారం జరుగుతుంది. ఈ విషయంపై ఆమె స్పందించారు. పార్టీ మారడం కన్ఫర్మ్ అని చెప్పేశారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా బరిలో ఉంటానని క్లారిటీ ఇచ్చారు. బీఆర్ఎస్ క్యాడర్ నాతోనే ఉందని అన్నారు.

Mynampally Hanmanth Rao: వారితో మాట్లాడిన తరువాతనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తా.. తప్పకుండా నా కొడుక్కి నేను సపోర్ట్ చేస్తా

వచ్చే 50రోజులు ప్రజల్లోకి వెళ్లి నాకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తానని రేఖానాయక్ అన్నారు. జాన్సన్ నాయక్ అసలు ఎస్టీనే కాదు, ఆయన కన్వర్టెడ్ క్రిస్టియన్ అని ఆరోపించారు. మంత్రి పదవి రేసులో ఉన్నాననే నన్ను తప్పించారు. బీఆర్ఎ‌స్‌లో అగ్రవర్ణాలకే ప్రాధాన్యత ఇచ్చారని రేఖానాయక్ విమర్శించారు. ఇదిలాఉంటే రేఖానాయక్ కాంగ్రెస్ కండువా కప్పుకోకుండానే టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆమె ఎమ్మెల్యే అభ్యర్థిత్వానికి దరఖాస్తు అందించారు. రేఖానాయక్ తరపున ఆమె పీఏ గాంధీభవన్‌లో దరఖాస్తు అందించారు. రేఖానాయక్ భర్త ఆసిఫాబాద్ సెగ్మెంట్‌కు దరఖాస్తు అందించారు. ఆయన స్వయంగా గాంధీ భవన్ కు వెళ్లి దరఖాస్తు చేసుకున్నారు.

Chandrababu Naidu: టీడీపీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం.. ఈనెల 28న ఢిల్లీకి .. ఎందుకంటే?

గాంధీ భవన్‌కు ధరఖాస్తు‌ల వెల్లువ ..
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఆశావహుల నుంచి గాంధీ భవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ధరఖాస్తు‌లను స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఐదు రోజుల్లో 280 ధరఖాస్తులు వచ్చాయి. సోమవారం ఒక్కరోజే 220 ధరఖాస్తులు వచ్చాయి. ఈనెల 25 వరకు ధరఖాస్తులు చేసుకొనేందుకు సమయం ఉంది. మరో 200 ధరఖాస్తు‌లు వస్తాయని పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు