తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశం జరుగుతోన్న వేళ ఓ కాంగ్రెస్ నేత బస్సులో అక్కడకు చేరుకోగా, ఓ బీఆర్ఎస్ నేత ఆటోలో వచ్చారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఆర్టీసీ బస్సులో అసెంబ్లీకి చేరుకున్నారు. ఆయన నాంపల్లి నుంచి బస్సులోనే ప్రయాణించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బస్సు ప్రయాణంపై మహిళలతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు.
అలాగే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఆటోలో అసెంబ్లీకి వచ్చారు. ఉచిత బస్సు ప్రయాణంతో ఆటో డ్రైవర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు. ఆటోడ్రైవర్ల ఉపాధి దెబ్బ తింటోందన్నారు. అందుకే అసెంబ్లీకి ఆటోలో వచ్చి నిరసన తెలిపానన్నారు.
కాగా, తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇవి తొలి బడ్జెట్ సమావేశాలు ఇవే.
ఆటో డ్రైవర్లకు జరుగుతున్న నష్టాన్ని నిరసిస్తూ ఆటోలో అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి pic.twitter.com/g7nRpi5JbR
— Telugu Scribe (@TeluguScribe) February 8, 2024
Congress MLC Balmuri Venkat came to the assembly in RTC bus
మొదటి రోజు అసెంబ్లీ కి ఆర్టీసీ బస్ లో వచ్చిన ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్.
? నాంపల్లి లో బస్ ఎక్కి అసెంబ్లీ కి వచ్చిన వెంకట్.
? ఉచిత బస్ ప్రయాణం పై మహిళలతో మాట్లాడిన వారి అభిప్రయాలు తెలుసుకున్న వెంకట్.@VenkatBalmoor pic.twitter.com/UxqNMZ4hsi— Congress for Telangana (@Congress4TS) February 8, 2024