తీహార్ జైల్లో కవితకు తప్పని ఇబ్బందులు.. అధికారుల తీరుపై ఆగ్రహం.. కోర్టులో ఫిర్యాదు

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఇబ్బందులు తప్పడం లేదు. కవితకు అన్ని సౌకర్యాలు కల్పించాలని కోర్టు ఆదేశాలు ఉన్నా..

MLC Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఇబ్బందులు తప్పడం లేదు. కవితకు పలు సౌకర్యాలు కల్పించాలని కోర్టు ఆదేశాలు ఉన్నా.. జైలు అధికారులు కవితకు వసతులు కల్పించడం లేదు. దీంతో తీహార్ జైలు అధికారులపై రౌస్ అవెన్యూ కోర్టుకు కవిత తరపు న్యాయవాదులు ఫిర్యాదు చేశారు. సీబీఐ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను తీహార్ జైలు అధికారులకు అందించినా ఎలాంటి వసతులు ఇవ్వలేదని, కనీసం రోజువారీ ఉపయోగించే దుస్తులకు కూడా అనుమతి ఇవ్వలేదని కోర్టు దృష్టికి కవిత తరపు న్యాయవాది మోహిత్ రావు తీసుకెళ్లారు. న్యాయవాదుల పిర్యాదు పై సమాధానం చెప్పాలని తీహార్ జైలు అధికారులను రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి భవేజా ఆదేశించారు. కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఎందుకు అమలు చేయలేదో శనివారం సమాధానం చెప్పాలని జైలు అధికారులను న్యాయమూర్తి ఆదేశించారు.

Also Read : Mlc Kavitha Arrest : కవితకు బెయిల్ వస్తుందా? ఏప్రిల్ 1న ఏం జరగనుంది? సర్వత్రా ఉత్కంఠ

లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈనెల 26న కవితకు 14రోజుల జ్యూడిషియల్ కస్టడీ విధిస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. జ్యుడిషియల్ కస్టడీలో తనకు కొన్ని సౌకర్యాలు కల్పించాలని న్యాయస్థానానికి కవిత విజ్ఞప్తి చేశారు. కవిత విజ్ఞప్తి మేరకు ఇంటి నుంచి భోజనం ఏర్పాటు చేసుకోవడం, రోజువారి ఉపయోగించే బట్టలు తీసుకోవడం, కొన్ని ఆభరణాలు ధరించడం వంటి విషయాల్లో రౌస్ అవెన్యూ కోర్టు అవకాశం కల్పించింది. సొంతంగా పరుపులు ఏర్పాటు చేసుకోవటం, దుప్పట్లు తెచ్చుకోవటం, చెప్పులు ధరించడానికి కోర్టు అవకాశం కల్పించింది.

Mlc Kavitha : ఎమ్మెల్సీ కవిత అభ్యర్థనకు కోర్టు అంగీకారం.. జైల్లో ఆ వెసులుబాటు

కవితను తీహార్ జైలుకు తరలించే ముందే సౌకర్యాల కల్పనపై సీబీఐ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. కానీ, తీహార్ జైలు అధికారులు కవితకు కోర్టు అనుమతి ఇచ్చిన విధంగా ఎలాంటి సౌకర్యాలు కల్పించక పోవటంతో కవిత తరపున న్యాయవాదులు రౌస్ అవెన్యూ కోర్టులో ఫిర్యాదు చేశారు.

 

ట్రెండింగ్ వార్తలు