MLC Kavitha : కేంద్రం చేసిన వంద లక్షల కోట్లు అప్పు మాటేమిటి? నిర్మలమ్మకు కవిత కౌంటర్

నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలపై ఆమె ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రగతిని ఆపే ప్రయత్నం బీజేపీ చేస్తోందని ఆరోపించారు. మోదీ ప్రధాని వచ్చాక కేంద్రం వంద లక్షల కోట్లను అప్పు చేసిందని కవిత విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన అప్పులకు కేంద్ర ప్రభుత్వ అప్పులకు పోలికే లేదన్నారు. దేశ జీడీపీకి పేద ప్రజల భాగస్వామ్యమే ఎక్కువగా ఉందన్నారు కవిత. పేద ప్రజల కోసం అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకాన్ని కూడా సక్రమంగా అమలు చేయడం లేదన్నారు.

MLC Kavitha : తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. కేంద్ర ప్రభుత్వం వర్సెస్ తెలంగాణ ప్రభుత్వంగా పరిస్థితి తయారైంది. కేంద్ర మంత్రులు, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. సై అంటే సై అంటూ విరుచుకుపడుతున్నారు. జోకులు ఆపవయ్యా కేసీఆర్ అంటే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన విమర్శలకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత్ కౌంటర్ ఇచ్చారు.

నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలపై ఆమె ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రగతిని ఆపే ప్రయత్నం బీజేపీ చేస్తోందని ఆరోపించారు. మోదీ ప్రధాని వచ్చాక కేంద్రం వంద లక్షల కోట్లను అప్పు చేసిందని కవిత విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన అప్పులకు కేంద్ర ప్రభుత్వ అప్పులకు పోలికే లేదన్నారు. దేశ జీడీపీకి పేద ప్రజల భాగస్వామ్యమే ఎక్కువగా ఉందన్నారు కవిత. పేద ప్రజల కోసం అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకాన్ని కూడా సక్రమంగా అమలు చేయడం లేదన్నారు.

Also Read..Minister KTR: “అన్నీ ఆ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తే ఎన్నో నష్టాలు” అంటూ సీతారామన్ కు కేటీఆర్ లేఖ

ఉపాధి హామీ కూలీల పొట్ట కొట్టేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు కవిత. కొత్తగా ఆవిర్భవించిన తెలంగాణ అభివృద్ధి కోసం సీఎం కెసీఆర్ ఎన్నోసార్లు ప్రధానికి విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదన్నారు. మెడికల్ కాలేజీల ఏర్పాటు కోసం సరికొత్త నిబంధనలను తెరపైకి తెచ్చి కేంద్ర ప్రభుత్వమే ఇక్కడ ఏర్పాటు చేయలేదన్నారు. తెలంగాణ జిల్లాల్లో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు అర్హత లేదని కేంద్రమే రాష్ట్రానికి లేఖ రాసిందన్నారు కవిత. తెలంగాణకు నవోదయ పాఠశాలలు మంజూరైనా.. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా అడ్డుకుంటోందని ఆరోపించారామె.(MLC Kavitha)

దేశంలో పర్ క్యాపిట ఆదాయాన్ని కేంద్రం ఎందుకు ప్రకటించడం లేదని కవిత నిలదీశారు. జనాభా లెక్కలను కేంద్రం ఎందుకు తీయడం లేదని ప్రశ్నించారు. ఇదే విషయాన్ని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రస్తావించారని గుర్తు చేశారు. కేంద్రం దగ్గర ఏ అంశానికి సంబంధించిన డేటా కూడా లేదని, అందుకే నో డేటా అలయన్స్(NDA) అని మేం అంటున్నాం అన్నారు. అడుగడుగునా తెలంగాణ అభివృద్దిని అడ్డుకునే ప్రయత్నం కేంద్రం చేస్తోందని కవిత ధ్వజమెత్తారు.

కాగా.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీపై జోకులు వద్దని సుతి మెత్తగా హెచ్చరించారు. “కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. మరి మీ సంగతేంటి?” అని నిలదీశారు. 2014లో తెలంగాణకు రూ.60 వేల కోట్ల అప్పు ఉండేదని, ఇప్పుడు రూ.3 లక్షల కోట్ల అప్పు అయిందని చెప్పారు నిర్మల.

Also Read..Nirmala Sitharaman: అసెంబ్లీలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఫైర్

నంబర్స్ చూసి విమర్శలు చేస్తే మంచిదని హితవు పలికారామె. మెడికల్ కాలేజీలు ఏయే జిల్లాల్లో ఉన్నాయో కేసీఆర్ కే తెలియదని ఎద్దేవా చేశారు. ఖమ్మం, కరీంనగర్ లో ఇప్పటికే మెడికల్ కాలేజీలు ఉన్నాయని, మళ్లీ ఆ జిల్లాల్లో కాలేజీలకు ప్రతిపాదనలు పెట్టారని చెప్పారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

కాగా, ఇటీవల అసెంబ్లీలో కేంద్ర ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఆర్థిక వ్యవస్థ గురించి ప్రధాని మోదీ మభ్యపెట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని, 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ పెద్ద జోక్ అని కేసీఆర్ అన్నారు. ఇంకా ఎక్కువే ఉండాలని, భారత్ కంటే మన పక్క దేశాలు బంగ్లాదేశ్, భూటాన్ బెటర్ గా ఉన్నాయని చెప్పారు. తలసరి ఆదాయంలో భారత్ ర్యాంకు 138 అని తెలిపారు. భారత్ కు ప్రధాని మోదీ కంటే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిందే ఎక్కువన్నారు కేసీఆర్.