Nirmala Sitharaman: అసెంబ్లీలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఫైర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మండిపడ్డారు. 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీపై జోకులు వద్దు అని అన్నారు. "కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు మరి మీ సంగతి ఏంటీ?" అని నిర్మల నిలదీశారు. 2014లో రూ.60 వేల కోట్ల అప్పు ఉండేదని, ఇప్పుడు రూ.3 లక్షల కోట్ల అప్పు అయిందని చెప్పారు.

Nirmala Sitharaman: అసెంబ్లీలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఫైర్

Nirmala Sitharaman

Nirmala Sitharaman: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మండిపడ్డారు. 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీపై జోకులు వద్దు అని అన్నారు. “కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు మరి మీ సంగతి ఏంటీ?” అని నిర్మల నిలదీశారు. 2014లో రూ.60 వేల కోట్ల అప్పు ఉండేదని, ఇప్పుడు రూ.3 లక్షల కోట్ల అప్పు అయిందని చెప్పారు.

నంబర్స్ చూసి విమర్శలు చేస్తే మంచిదని అన్నారు. మెడికల్ కాలేజీలు ఏయే జిల్లాల్లో ఉన్నాయో కేసీఆర్ కే తెలియదని ఎద్దేవా చేశారు. ఖమ్మం, కరీంనగర్ లో ఇప్పటికే మెడికల్ కాలేజీలు ఉన్నాయని, మళ్లీ ఆ జిల్లాల్లో కాలేజీలకు ప్రతిపాదనలు పెట్టారని చెప్పారు.

కాగా, ఇటీవల అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగిస్తూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఆర్థిక వ్యవస్థ గురించి ప్రధాని మోదీ మభ్యపెట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని, 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ పెద్ద జోక్ అని కేసీఆర్ అన్నారు. ఇంకా ఎక్కువే ఉండాలని, భారత్ కంటే మన పక్క దేశాలు బంగ్లాదేశ్, భూటాన్ బెటర్ గా ఉన్నాయని చెప్పారు. తలసరి ఆదాయంలో భారత్ ర్యాంకు 138 అని తెలిపారు. భారత్ కు ప్రధాని మోదీ కంటే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిందే ఎక్కువని చెప్పారు.

అలాగే, అప్పులు చేయడంలో ప్రధాని మోదీని మించిన వారు ఎవరూ లేరని విమర్శించారు. మన్మోహన్ సింగ్ హయాంలో ద్రవ్యలోటు 4.77 శాతంగా ఉండేదని, ఇప్పుడు అది 5.1 శాతానికి చేరిందని అన్నారు. అలాగే, మెడికల్ కాలేజీల ప్రతిపాదనలపై బీఆర్ఎస్ నేతలు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. వాటికి నిర్మలా సీతారామన్ కౌంటర్ ఇచ్చారు.

Minister KTR: “అన్నీ ఆ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తే ఎన్నో నష్టాలు” అంటూ సీతారామన్ కు కేటీఆర్ లేఖ