Minister KTR: “అన్నీ ఆ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తే ఎన్నో నష్టాలు” అంటూ సీతారామన్ కు కేటీఆర్ లేఖ

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు తెలంగాణ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. అంతర్జాతీయ డేటా రాయబార కార్యాలయం, ఎంబసీల ఏర్పాటు వంటి అంశాలను అందులో ప్రస్తావించారు. గుజరాత్ లో వాటి ఏర్పాటుకు కేంద్ర సర్కారు ప్రాధాన్యం ఇవ్వడం పట్ల కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. గుజరాత్ లోని గిఫ్ట్ సిటీలో ఎంబసీల ఏర్పాటు ప్రతిపాదనలు సరికాదని కేటీఆర్ లేఖలో చెప్పారు.

Minister KTR: “అన్నీ ఆ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తే ఎన్నో నష్టాలు” అంటూ సీతారామన్ కు కేటీఆర్ లేఖ

Minister KTR: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు తెలంగాణ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. అంతర్జాతీయ డేటా రాయబార కార్యాలయం, ఎంబసీల ఏర్పాటు వంటి అంశాలను అందులో ప్రస్తావించారు. గుజరాత్ లో వాటి ఏర్పాటుకు కేంద్ర సర్కారు ప్రాధాన్యం ఇవ్వడం పట్ల కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. గుజరాత్ లోని గిఫ్ట్ సిటీలో ఎంబసీల ఏర్పాటు ప్రతిపాదనలు సరికాదని కేటీఆర్ లేఖలో చెప్పారు.

అన్నీ ఒకే ప్రదేశంలో ఏర్పాటు చేస్తే ఎన్నో నష్టాలు ఉంటాయని వివరించారు. భూకంపాలు ఎక్కువ సంభవించే రాష్ట్రంలో ఏర్పాటు చేయడం సరికాదని, నష్టం జరుగుతుందని కేటీఆర్ అన్నారు. అలాగే, అంతర్జాతీయ సరిహద్దు ఉన్న రాష్ట్రంలో నిర్మిస్తే భద్రతాపరంగానూ మనకు మంచికాదని చెప్పారు. డేటా సెంటర్ల నిర్వహణలో ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం తన సమర్థతను నిరూపించుకుందని కేటీఆర్ అన్నారు.

వాటికి హైదరాబాద్ ఆదర్శ ప్రదేశంగా ఉందని కేటీఆర్ వివరించారు. కాగా, నిర్మలా సీతారామన్‌ కు కేటీఆర్ నెలరోజుల క్రితం కూడా లేఖ రాసిన విషయం తెలిసిందే. హైదరాబాద్ ఫార్మాసిటీకి బడ్జెట్ లో నిధులు కేటాయించాలని, చేనేత రంగానికి జీఎస్టీని మినహాయించాలని, తెలంగాణ పరిశ్రమలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించాలని అప్పట్లో ఆయన కోరారు. ఇప్పుడు మరోసారి లేఖ రాశారు.

Karnataka Road Accident: కర్ణాటకలో కారును ఢీ కొన్న మరో వాహనం.. నలుగురు హైదరాబాదీలు మృతి