Karnataka Road Accident: కర్ణాటకలో కారును ఢీ కొన్న మరో వాహనం.. నలుగురు హైదరాబాదీలు మృతి

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారును మరో వాహనం ఢీ కొని నలుగురు హైదరాబాదీలు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. కొప్పల జిల్లా బడ్నేకుప్ప వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతుల వివరాలు తెలిపారు. మృతులు హైదరాబాద్ కు చెందిన రూపావతి, వర్ధిని, షణ్ముఖ, విక్రమ్ గా గుర్తించినట్లు చెప్పారు.

Karnataka Road Accident: కర్ణాటకలో కారును ఢీ కొన్న మరో వాహనం.. నలుగురు హైదరాబాదీలు మృతి

Road Accident

Updated On : February 16, 2023 / 5:51 PM IST

karnataka road accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారును మరో వాహనం ఢీ కొని నలుగురు హైదరాబాదీలు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. కొప్పల జిల్లా బడ్నేకుప్ప వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతుల వివరాలు తెలిపారు. మృతులు హైదరాబాద్ కు చెందిన రూపావతి, వర్ధిని, షణ్ముఖ, విక్రమ్ గా గుర్తించినట్లు చెప్పారు.

రోడ్డు ప్రమాదానికి గురైన ఆ కారు నంబరు టీఎస్ 29పి3693 అని తెలిపారు. రూపావతి, వర్ధిని, షణ్ముఖ్, విక్రమ్ స్వస్థలం ప్రకాశం జిల్లా. వారు చాలా కాలంగా హైదరాబాద్ లో నివసిస్తున్నారు. మృతుల బంధువులకు పోలీసులు సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్నారు.

కారును ఢీ కొట్టిన వాహన డ్రైవరును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ రోడ్డు ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రూపావతి, వర్ధిని, షణ్ముఖ, విక్రమ్ ఓ పంక్షన్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ఆసుపత్రికి తరలించనున్నారు.

Fire Boltt Apollo Smartwatch : రూ.3వేల లోపు ధరకే ఫైర్ బోల్ట్ అపోలో స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ చేసుకోవచ్చు.. ఇప్పుడే కొనేసుకోండి..!