Telangana: ఇషాసింగ్‌, మొగిలయ్యకు ఇళ్ల స్థలాల పత్రాలు అందజేత.. మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై గువ్వల అసహనం

తెలంగాణ యువ షూటర్‌, అంతర్జాతీయ స్థాయిలో భారత్ కు పతకాల పంట పండిస్తున్న ఇషాసింగ్‌ తో పాట కిన్నెర వాయిద్యకారుడు, పద్మశ్రీ మొగిలయ్యకు రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఇళ్ల స్థలాలకు సంబంధించిన పత్రాలు అందజేసింది. హైదరాబాద్ లోని బూర్గుల రామకృష్ణా రావ్‌ (బీఆర్కేఆర్) భవన్ లో వారికి రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇళ్ల స్థలాల పత్రాలు అందించారు. ఇషాసింగ్‌, మొగిలయ్యకు 600 గజాల చొప్పున ఇళ్ల స్థలాలను ఇచ్చారు.

Telangana: ఇషాసింగ్‌, మొగిలయ్యకు ఇళ్ల స్థలాల పత్రాలు అందజేత.. మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై గువ్వల అసహనం

Telangna

Telangana: తెలంగాణ యువ షూటర్‌, అంతర్జాతీయ స్థాయిలో భారత్ కు పతకాల పంట పండిస్తున్న ఇషాసింగ్‌ తో పాట కిన్నెర వాయిద్యకారుడు, పద్మశ్రీ మొగిలయ్యకు రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఇళ్ల స్థలాలకు సంబంధించిన పత్రాలు అందజేసింది. హైదరాబాద్ లోని బూర్గుల రామకృష్ణా రావ్‌ (బీఆర్కేఆర్) భవన్ లో వారికి రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇళ్ల స్థలాల పత్రాలు అందించారు. ఇషాసింగ్‌, మొగిలయ్యకు 600 గజాల చొప్పున ఇళ్ల స్థలాలను ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా పాల్గొన్నారు.

 Ishasingh


Ishasingh

శ్రీనివాస్ గౌడ్ తీరుపై గువ్వల బాలరాజు అసహనం
శ్రీనివాస్ గౌడ్ తీరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అసహనం వ్యక్తం చేశారు. ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీకి తనని పిలవకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే, కొంతమంది క్రీడాకారులకు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లో ఇళ్ల స్థలాలు ఇచ్చి, మొగిలయ్యకు మాత్రం బీఎన్ రెడ్డిలో స్థలం ఇవ్వడం ఏంటని నిలదీశారు.

మొగిలయ్యను ఢిల్లీ తీసుకెళ్లి రాష్ట్రంలో అందరికీ తన కళను గుర్తు చేసింది తానని అన్నారు. అయినప్పటికీ తనకు ఇళ్ల స్థలాల పంపిణీపై కనీసం సమాచారం కూడా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని సీఎం కేసిఆర్ దృష్టికి తీసుకెళ్తానని గువ్వల బాలరాజు చెప్పారు. అలాగే, బీజేపీ నేతలపై గువ్వల బాలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయంపై కూడా బీజేపీ నేతలు విషం కక్కుతున్నారని అన్నారు. యువతను రెచ్చగొట్టడమే తన విధానంగా బీజేపీ పెట్టుకుందని చెప్పారు.

Trains Collide: ఎదురెదురుగా వచ్చి ఢీకొట్టకున్న రెండు గూడ్స్ రైళ్లు.. ప్రాణనష్టం లేదని ప్రకటించిన రైల్వే