BRS: గ్రేటర్‌లో మరింత పట్టు సాధించేందుకు బీఆర్ఎస్ స్కెచ్

లేటెస్ట్ పొలిటికల్ సిచ్యువేషన్‌లో కాంగ్రెస్, బీజేపీ వైఖరిని తెలియజేసేందుకు మేయర్, డిప్యూటీ మేయర్లపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టే యోచనలో గులాబీ దళం ఉన్నట్లు తెలుస్తోంది.

గ్రేటర్ హైదరాబాద్‌పై మరింత పట్టు సాధించేందుకు పావులు కదుపుతోంది బీఆర్ఎస్. తమ పార్టీ నుంచి గెలిచి..కాంగ్రెస్‌లో చేరిన మేయర్, డిప్యూటీ మేయర్లకు అవిశ్వాసంతో ఝలక్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. మేయర్‌గా గద్వాల్ విజయలక్ష్మి పదవి బాధ్యతలు చేపట్టి నాలుగేళ్లు పూర్తి కావడంతో అవిశ్వాసం పెట్టేందుకు ప్లాన్ చేస్తోంది బీఆర్ఎస్. నో కాన్ఫిడెన్స్ మోషన్‌ పెట్టే వ్యూహం వర్కౌట్ అయితే చాలా అంశాలపై క్లారిటీ వస్తుందని భావిస్తోంది గులాబీ దళం.

ములాఖత్ విమర్శలకు చెక్ పెట్టేందుకే అవిశ్వాసం రూటు ఎంచుకుందట బీఆర్ఎస్. రాష్ట్రంలో ఇప్పటికే కుమ్మక్కు రాజకీయాల టాపిక్‌ ట్రెండింగ్‌లో ఉంది. బీఆర్ఎస్, బీజేపీ కలిసి పనిచేస్తున్నాయని కాంగ్రెస్ అంటుంటే..బీజేపీ, కాంగ్రెస్‌ ఒక్కటేనని బీఆర్ఎస్ అంటోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని బీజేపీ విమర్శిస్తోంది. ఇంతకీ ఎవరు ఎవరితో ములాఖత్‌ అయ్యారో తేలిపోయే సమయం వచ్చేసిందంటోంది బీఆర్ఎస్. గ్రేటర్ హైదరాబాద్‌ వేదికగా తాము ఎవరితో కుమ్మక్కు కాలేదని..సింగిల్‌గానే ఉన్నామని తేల్చి చెప్పేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

14 మంది కార్పొరేటర్లు హస్తం గూటికి
పార్లమెంట్ ఎన్నికలకు ముందు మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి సహా 14 మంది కార్పొరేటర్లు హస్తం గూటికి చేరారు. మేయర్, డిప్యూటీ మేయర్ పార్టీ మారడంతో గ్రేటర్‌లో గులాబీపార్టీ పట్టు సడలినట్లు అయింది. లేటెస్ట్‌ రాజకీయ పరిణామాలతో కాంగ్రెస్, బీజేపీలకు చెక్ పెడుతూనే..ఎంఐఎం తీరును తెలియజేసేలా అవిశ్వాస అస్త్రాన్ని ప్రయోగించేందుకు రెడీ అవుతోంది బీఆర్ఎస్.

గులాబీ పార్టీ 55 కార్పొరేటర్ స్థానాలను గెలుచుకొని అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ 48 స్థానాలతో రెండోస్థానంలో, 44 స్థానాలతో ఎంఐఎం మూడోస్థానం దక్కించుకుంది. గ్రేటర్ పరిధిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల ఎక్స్‌అఫిషియో సభ్యుల మద్దతుతో గులాబీ పార్టీ మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాలను ఈజీగా తమ ఖాతాలో వేసుకోగలిగింది. మేయర్, డిప్యూటీ మేయర్ పార్టీ మారడంతో ఆ పదవులను తిరిగి సొంతం చేసుకోవాలని ప్లాన్ చేస్తోంది.

బీఆర్ఎస్ అవిశ్వాసం పెడితే?
లేటెస్ట్ పొలిటికల్ సిచ్యువేషన్‌లో కాంగ్రెస్, బీజేపీ వైఖరిని తెలియజేసేందుకు మేయర్, డిప్యూటీ మేయర్లపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టే యోచనలో గులాబీ దళం ఉన్నట్లు తెలుస్తోంది. మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు నిలబెట్టుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా అవిశ్వాసం నెగ్గే అవకాశం లేనేలేదు. అవిశ్వాసంలో కాంగ్రెస్ నెగ్గాలంటే మరో పార్టీ మద్దతు కచ్చితంగా అవసరం.

బీఆర్ఎస్ అవిశ్వాసం పెడితే బీజేపీ మద్దతు ఇచ్చే అవకాశం దాదాపు లేదు. ఇదే సమయంలో ఎంఐఎం అధికార పార్టీకి సహకరించే అవకాశం ఉంటుంది. ఎంఐఎం, కాంగ్రెస్‌కు సహకరిస్తే చోటుచేసుకునే పరిణామాలను బేరీజు వేసుకుంటుందట బీఆర్ఎస్. అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడితే రాజకీయ సమీకరణలు ఎలా ఉంటాయన్న దానిపై గులాబీ పార్టీ ముమ్మరంగా కసరత్తు చేస్తుందంటున్నారు.

అవిశ్వాసం నెగ్గినా..నెగ్గకపోయినా..ఏదో ఒక విషయం అయితే క్లారిటీ వస్తుందని అనుకుంటుందట బీఆర్ఎస్. అవిశ్వాసం నెగ్గితే గ్రేటర్‌లో కీలకమైన మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను కొత్త నేతలకు ఇస్తే జోష్‌ పెరుగుతోందని అనుకుంటుందట. అవిశ్వాసం వీగితే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్న పార్టీలేంటో కూడా క్లారిటీ వస్తుందని భావిస్తోంది బీఆర్ఎస్. దీంతో క్షేత్రస్థాయిలో రాజకీయంగా గులాబీ పార్టీ వ్యూహాలకు మరింత పదును పెట్టే అవకాశం దక్కుతుందని గులాబీ పార్టీ అంచనా వేస్తోంది.

పవన్ కల్యాణ్, బొత్స సత్యనారాయణ ఆలింగనం వెనుక అంత డెప్త్ ఉందా? ఇప్పటికే జనసేనలో బొత్స తమ్ముడు..