BRS Chief KCR : రేపు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం.. అభ్యర్థుల విషయంపై కేసీఆర్ క్లారిటీ ఇస్తారా?

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు.

BRS Chief KCR

BRS Party : జనవరి 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 9వ తేదీ వరకు ఈ సమావేశాలు జరగనుండగా.. ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్ ను విడుదల చేయనుంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ మేరకు రేపు (శుక్రవారం) బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. రేపు మధ్యాహ్నం 12.30 గంటలకు గజ్వేల్ ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభమవుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, ఆపరేషన్ తరువాత మాజీ సీఎం కేసీఆర్ పాల్గొంటున్న పార్టీ కార్యక్రమం ఇదే.

Also Read : సొంతగూటికి తిరిగొచ్చిన జగదీశ్ షెట్టర్.. కాంగ్రెస్‌కు గుడ్ బై, బీజేపీలో చేరిక

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఈ సెషన్ కు ఇవే చివరి సమావేశాలు కావడంతో బీఆర్ఎస్ అనుసరించనున్న వ్యూహంపై రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. దాదాపు పదేళ్లుగా రాష్ట్రంలో అధికారంలోనే కొనసాగిన బీఆర్ఎస్.. విభజన చట్టప్రకారం రాష్ట్రంకు కేంద్రం నుంచి రావాల్సిన అన్ని అంశాలపై ఎప్పటికప్పుడు ప్రస్తావిస్తూనే వచ్చింది. ఇప్పుడు కూడా రాష్ట్ర పున:విభజన అంశాలపై పార్లమెంట్ వేదికగా పూర్తిస్థాయిలో ఎండగట్టాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఈ మేరకు కేసీఆర్ ఎంపీలకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది.

Also Read : Padi Kaushik Reddy : పాడి కౌశిక్ రెడ్డి ఎన్నికల ప్రచారంపై గవర్నర్ సీరియస్.. చర్యలకు ఈసీకి ఆదేశం

లోక్ సభ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల విషయంలోనూ కేసీఆర్ అనధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో 13 నుంచి 14 నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఇప్పటికే ఖరారైనట్లు తెలుస్తోంది. రేపు జరగబోయే పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపిక చేసిన అభ్యర్థులకు బీఆర్ఎస్ అధినేత అనధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

 

 

 

ట్రెండింగ్ వార్తలు