MLC Bandaru Prakash : తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ గా ఎమ్మెల్సీ బండ ప్రకాశ్

తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ పదవికి ఎమ్మెల్సీ బండ ప్రకాశ్ ముదిరాజ్ పేరును బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. ఈ మేరకు శనివారం నామినేషన్ వేయాల్సిందిగా బండా ప్రకాశ్ కు సీఎం సూచించారు.

MLC Bandaru Prakash

MLC Bandaru Prakash : తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ పదవికి ఎమ్మెల్సీ బండ ప్రకాశ్ ముదిరాజ్ పేరును బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. ఈ మేరకు శనివారం నామినేషన్ వేయాల్సిందిగా బండా ప్రకాశ్ కు సీఎం సూచించారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని సంబంధిత పార్టీ నాయకులను సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ గా వ్యవహరించిన ఎమ్మెల్సీ నేతి విద్యా సాగర్ పదవీకాలం 2012, జూన్ 3న పూర్తైంది.

దీంతో అప్పటినుంచి డిప్యూటీ చైర్మన్ పదవి ఖాళీగా ఉంది. ఈ క్రమంలో డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు శుక్రవారం నోటిఫికేషన్ విడులైంది. నేడు నామినేషన్లను స్వీకరించనున్నారు. ఫిబ్రవరి 12న ఉదయం 10 గంటలకు శాసన మండలి ప్రారంభమైన అనంతరం డిప్యూటీ చైర్మన్ ఎన్నిక ప్రక్రియను పూర్తి చేసి బాధ్యతలు అప్పగించనున్నారు.

Telangana State Secretariat: ఎన్నో ప్రత్యేకతలతో తెలంగాణ నూతన సచివాలయ నిర్మాణం

బండా ప్రకాశ్ 2018 మార్చిలో బీఆర్ఎస్ తరపున రాజ్యసభకు ఎన్నికయ్యారు. అయితే, ఎంపీగా ఆరేళ్ల పదవీకాలం పూర్తికాకముందే 2021 నవంబర్ ఎమ్మెల్యే కోటాలో శాసన మండలికి ఎంపికయ్యారు. అనంతరం అదే ఏడాది డిసెంబర్ మొదటివారంలో తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.