Telangana State Secretariat: ఎన్నో ప్రత్యేకతలతో తెలంగాణ నూతన సచివాలయ నిర్మాణం
తెలంగాణ నూతన సచివాలయాన్ని ఈ నెల 17న ముఖ్యమంత్రి కేసీఆర్ తన జన్మదినోత్సవం సందర్భంగా ప్రారంభించనున్న వేళ అందరి దృష్టి దీనిపైనే ఉంది. నూతన సచివాలయాన్ని ఎన్నో ప్రత్యేకతలతో నిర్మించారు. దీని కోసం పనిచేసిన ఆర్కిటెక్ట్ లు పలు వివరాలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్తమతో కొన్ని రోజుల పాటు చర్చించారని చెప్పారు. భవన నిర్మాణ, డిజైన్ల ప్రణాళికలపై సూచనలు చేశారని అన్నారు.

telangana secretariat new building
Telangana State Secretariat: తెలంగాణ నూతన సచివాలయాన్ని ఈ నెల 17న ముఖ్యమంత్రి కేసీఆర్ తన జన్మదినోత్సవం సందర్భంగా ప్రారంభించనున్న వేళ అందరి దృష్టి దీనిపైనే ఉంది. నూతన సచివాలయాన్ని ఎన్నో ప్రత్యేకతలతో నిర్మించారు. దీని కోసం పనిచేసిన ఆర్కిటెక్ట్ లు పలు వివరాలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్తమతో కొన్ని రోజుల పాటు చర్చించారని చెప్పారు. భవన నిర్మాణ, డిజైన్ల ప్రణాళికలపై సూచనలు చేశారని అన్నారు.
ముఖ్యమంత్రి కార్యాలయం ఉండే అంతస్తును అన్ని రకాల సౌకర్యాలతో నిర్మించామని తెలిపారు. ముఖ్యమంత్రి చాంబర్లు, కాన్ఫరెన్స్ గదులు, కేబినెట్ గదులు, వీవీఐపీల వెయిటింగ్ హాళ్లు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సలహాదారులు, ప్రిన్సిపల్ సెక్రటేరీల చాంబర్లు, సమావేశ మందిరాలు వంటి వాటిపై ప్రణాళికలు వేసుకున్నట్లు చెప్పారు. కొన్ని అంతస్తులను మంత్రుల అవసరాలకు తగ్గట్లు రూపొందించామని తెలిపారు.
వాటిల్లో మంత్రుల చాంబర్లు, కాన్ఫరెన్స్ గదులు, వెయిటింగ్ ప్రాంతాలు, అధికారులు, సిబ్బంది కార్యాలయాలు, లంచ్ రూమ్, టాయిలెట్స్ వంటివి వాటిపై డిజైన్లు వేశామని చెప్పారు. కింది అంతస్తును సర్వీసులు, సచివాలయానికి వచ్చేవారు తమ కార్యాలయాలకు వెళ్లేందుకు అనువుగా రూపొందించామని తెలిపారు. మొత్తం మాస్టర్ ప్లాన్ లో సచివాలయ భవనం, అక్కడకు వచ్చే వారి కోసం అనుబంధ భవనాలు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కార్యాలయాలు, మందిరం, మసీదు, చర్చి ఉన్నాయని వివరించారు.
మొక్కలు పెంచే ప్రాంతాలు, సందర్శకుల కోసం మార్గాలు, చెట్లు పెంచే ప్రాంతాలు, వీవీఐపీలు, సచివాలయ సిబ్బంది, సందర్శకుల పార్కింగ్ వంటి వాటికి చాలా స్థలాన్ని కేటాయించినట్లు తెలిపారు. సచివాలయ కాంప్లెక్స్ చుట్టూ 16 అడుగుల మెటల్ గ్రిల్ డిజైన్ తో ఫెన్స్ ను రూపొందించామని చెప్పారు. మాస్టర్ ప్లానింగ్, వాస్తు మార్గదర్శకాలు వంటి ఇతర అన్ని అంశాలకు తగ్గట్లుగా సచివాలయాన్ని నిర్మించాల్సి వచ్చిందని తెలిపారు.
కరోనా లాక్ డౌన్ సమయంలో ఆయా అంశాలను చర్చించేందుకు, ప్రణాళికలు వేసుకునేందుకు, సిబ్బంది, కూలీల కోసం కష్టపడాల్సి వచ్చిందని అన్నారు. 150 ఏళ్ల పాటు ఆ భవనం దృఢంగా నిలిచేలా రూపొందించామని చెప్పారు. సచివాలయంలో ప్రధాన ప్రవేశ ద్వారం తూర్పు వైపున ఉంటుందని తెలిపారు.
ముఖ్యమంత్రి కోసం ప్రత్యేకంగా ఎంట్రన్స్ ఉండేలా చూసుకున్నామని అన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం ఏడో అంతస్తులో ఉంటుందని చెప్పారు. సచివాలయ భవన మొత్తం ప్రాంతం దాదాపు 10 లక్షల చదరపు అడుగులు ఉంటుందని తెలిపారు. మల్లీపర్పస్ హాళ్లు కూడా సచివాలయంలో ఉంటాయని చెప్పారు.
Dr BR Ambedkar Telangana State Secretariat: What the architects have to say