లాస్య నందిత భౌతిక కాయానికి కేసీఆర్ నివాళి

రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత భౌతిక కాయానికి బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ నివాళి అర్పించారు.

kcr tribute to lasya nanditha: రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత భౌతిక కాయానికి బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నివాళి అర్పించారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన కార్ఖానాలోని లాస్య నందిత నివాసానికి విచ్చేశారు. చిన్నవయసులోనే అకాల మరణం పాలైన లాస్య నందిత భౌతిక కాయానికి పుష్పగుచ్ఛంతో నివాళి అర్పించారు. శోకసంద్రంలో మునిగిపోయిన లాస్య నందిత కుటుంబ సభ్యులను కేసీఆర్ ఓదార్చారు. అధైర్య పడొద్దని, అండగా ఉంటానని భరోసాయిచ్చారు. ఎంతో రాజకీయ భవ్యిషత్తు ఉన్న యువ ఎమ్మెల్యే అకాల మరణం పాలవడం చాలా బాధాకరమని కేసీఆర్ పేర్కొన్నారు.

కేసీఆర్ వెంట బీఆర్ఎస్ నాయకులు ప్రశాంత్ రెడ్డి, హరీశ్ రావు, తలసాని శ్రీనివాస యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, సంతోష్ కుమార్, బాల్క సుమన్ తదితరులు ఉన్నారు. లాస్య నందితను నివాళి అర్పించేందుకు బీఆర్ఎస్ కార్యకర్తలు భారీ ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఈస్ట్ మారేడుపల్లి స్మశాన వాటికలో ఈరోజు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

Also Read: బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత అకాల మరణంపై స్పందించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

ట్రెండింగ్ వార్తలు