BRS Moves Supreme Court : సుప్రీంకోర్టుకు బీఆర్ఎస్.. పార్టీ ఫిరాయింపులపై పిటిషన్‌.. ఏం జరగనుంది?

పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పార్టీ మారిన 10మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడం లేదని పిటిషన్ లో పేర్కొంది.

BRS Moves Supreme Court : పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పార్టీ మారిన 10మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడం లేదని పిటిషన్ లో పేర్కొంది. ఫిర్యాదు చేసి 9 నెలలు అవుతున్నా అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకోలేదని, కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదని పిటిషన్ లో పేర్కొంది. రెండు పిటిషన్లు దాఖలు చేసిన బీఆర్ఎస్.. దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరిలపై స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది.

మిగిలిన ఏడుగురు ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా రిట్ పిటిషన్ దాఖలు చేసింది. నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకునేలా స్పీకర్ ను ఆదేశించాలని సుప్రీంకోర్టును కోరింది. ఢిల్లీలోనే ఉన్న హరీశ్ రావు దీనిపై లీగల్ టీమ్ తో చర్చిస్తున్నట్లు సమాచారం.

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని బీఆర్ఎస్ పార్టీ ఆశ్రయించింది. బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని పేర్కొనడం జరిగింది. రెండు పిటిషన్లను సుప్రీంకోర్టులో ఫైల్ చేసింది బీఆర్ఎస్. ఒకటి ఎస్ ఎల్పీ, మరొకటి రిట్.

ప్రధానంగా పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసి 9 నెలలు అవుతున్నా స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తన పిటిషన్ లో బీఆర్ఎస్ పేర్కొంది. కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్.. ఈ ముగ్గురికి వ్యతిరేకంగా ఎస్ ఎల్పీని బీఆర్ఎస్ ఫైల్ చేసింది. అలాగే మిగిలిన ఏడుగురు ఎమ్మెల్యేలకు (పోచారం, కాలె యాదయ్య, సంజయ్, కృష్ణమోహన్, మహిపాల్ రెడ్డి) వ్యతిరేకంగా రిట్ పిటిషన్ దాఖలు చేసింది బీఆర్ఎస్.

రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చి 6 నెలలు అవుతున్నా ఇప్పటివరకు స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదంది. గతంలో మేఘచంద్ర కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అమలు చేయాలని బీఆర్ఎస్ తన పిటిషన్ లో పేర్కొంది. కనీసం నోటీస్ కూడా ఇవ్వలేదంది. హైకోర్టు చెప్పినా.. ఇప్పటివరకు వారి వివరణ కూడా స్పీకర్ అడగలేదని పరిస్థితి ఉంది.

పూర్తి వివరాలు..

Also Read : దమ్ముంటే రా.. లై డిటెక్టర్ టెస్ట్ పై సీఎం రేవంత్ కు కేటీఆర్ సవాల్..