KTR : ఇంట్లో దావత్ చేసుకుంటే తప్పా.. చేతనైతే రాజకీయంగా తలపడండి.. : కేటీఆర్

Janwada Farm House : రాజకీయంగా మేం లేవనెత్తిన ప్రశ్నలకు కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పలేక ఇలాంటి ఆరోపణలకు పాల్పడుతుందని కేటీఆర్ మండిపడ్డారు.

BRS Working President KTR

Janwada Farm House : తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన జన్వాడ ఫామ్‎హౌస్ రేవ్ పార్టీ కేసుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. హైదరాబాద్‎లోని నందినగర్‌లో ఆదివారం (అక్టోబర్ 27) కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయంగా మేం లేవనెత్తిన ప్రశ్నలకు కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పలేక ఇలాంటి ఆరోపణలకు పాల్పడుతుందని మండిపడ్డారు.

తమను రాజకీయంగా ఎదుర్కోలేక.. తమ బంధువుల మీద కేసులు పెట్టి తమ గొంతు నొక్కాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోందని ధ్వజమెత్తారు. నిన్నటి నుంచి ఈరోజు వరకు ఒక ప్రహసనం లాగా నడుపుతున్నారని విమర్శించారు. తన కుటుంబసభ్యులతో తమ ఇంట్లో దావత్ చేసుకునేందుకు అనుమతి తీసుకోవాలని అంటున్నారని మండిపడ్డారు.

అది ఫామ్ హౌస్ కాదు.. కొత్త సొంత ఇంట్లోకి వెళ్లినందుకు దావత్ ఇచ్చారని కేటీఆర్ క్లారిటీ చేశారు. కానీ, అది రేవ్ పార్టీ అంటూ చిత్రీకరిస్తున్నారని దుయ్యబట్టారు. అది మా బావమరిది ఇళ్ళు.. పురుషులు, మహిళలు కాదు.. వాళ్లు భార్య భర్తలుగా పేర్కొన్నారు. అక్కడ డ్రగ్స్ ఆనవాళ్లు ఏం దొరకలేదని ఒక ఎక్సైజ్ సూపరిండెంట్ చెప్పారన్నారు. ఎక్సైజ్ అధికారులు స్పష్టంగా చెప్పారన్నారు. బాటిల్స్ ఉన్నాదానికంటే ఎక్కువ ఉన్నాయంటూ సప్లయర్, వినియోగదారులు అంటున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు.

అక్కడ 14 మందికి టెస్ట్ చేస్తే.. 13 మందికి నెగిటివ్ వచ్చిందని, ఒక్కరికీ పాజిటివ్ వచ్చిందని గుర్తు చేశారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఎక్కడ తీసుకున్నారో విచారించాలన్నారు. చేతనైతే రాజకీయంగా తలపడండి.. అంతే కానీ మా కుటుంబ సభ్యులను వేదిస్తామంటే కుదరదని కేటీఆర్ మండిపడ్డారు. రాజ్ పాకాల ఏం తప్పు చేశారు? కొత్త ఇంట్లోకి వెళ్లినందుకు దావత్ చేసుకున్నారు అది తప్పా.. అంటూ ఆయన సూటిగా ప్రశ్నించారు. మీ పరిపాలన వైఫల్యాలను అవినీతిని ఎండగడుతూనే ఉంటామని కేటీఆర్ స్పష్టంచేశారు.

Read Also : Abids Fire Incident : అబిడ్స్‎లో భారీ అగ్ని ప్రమాదం.. భయంతో స్థానికుల పరుగులు.. వీడియో వైరల్!