Abids Fire Incident : అబిడ్స్‌లో భారీ అగ్ని ప్రమాదం.. భయంతో స్థానికుల పరుగులు.. వీడియో వైరల్!
Abids Fire Incident : అబిడ్స్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. క్రాకర్స్ పేలడంతో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి.

Massive Fire Incident at Abids
Abids Fire Incident : హైదరాబాద్‌లోని అబిడ్స్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బొగ్గులకుంట క్రాకర్స్ షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అబిడ్స్ బొగ్గులకుంట నుంచి కోఠి హనుమాన్ ఆలయానికి వెళ్లే మార్గంలో ఈ ప్రమాదం జరిగింది. క్రాకర్స్ పేలడంతో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. దాంతో క్రాకర్స్ దుకాణంలోని వారితో పాటు స్థానికులంతా భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులతో పాటు అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు.
4 ఫైరింజన్ల సాయంతో అగ్నిమాపక సిబ్బంది క్రాకర్స్ షాపులో ఎగసిపడుతున్న మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాద ఘటనలో ఇద్దరు మహిళలు తీవ్ర అస్వస్థత గురికాగా వారిని వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు. క్రాకర్స్ షాపులో బాణాసంచా ఎక్కువ మొత్తంలో ఉండటంతో మంటలు చెలరేగుతున్నాయి. ఫైర్ క్రాకర్స్ షాప్ పక్కన ఉన్న హోటల్‌కు కూడా మంటలు వ్యాపించడంతో మరింత భయాందోళనకరంగా మారింది.
ఈ మంటలు బయటకు ఎగసిపడటంతో అక్కడే పార్క్ చేసిన పలు వాహనాలు మంటల్లో దగ్ధమయ్యాయి. అగ్నిప్రమాదంలో భారీ ఆస్తి నష్టం వాటిలినట్టుగా తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
అబిడ్స్‌లో భారీ అగ్ని ప్రమాదం.. భయంతో పరుగులు తీసిన స్థానికులు pic.twitter.com/ujClAOEbiY
— Prashanth (@itzmibadboi) October 27, 2024