brutal incident in Rangareddy district
brutal incident in Rangareddy district : రంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో కొడుకు తన తల్లిపైనే దాడి చేశాడు. సుత్తితో బలంగా ఆమె తలపై కొట్టాడు.
రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో ఈ దారుణ ఘటన జరిగింది. మద్యం మత్తులో శ్రీకాంత్ (32) తన కన్నతల్లి మానుపాటి ఐలమ్మ (50)ను హత్య చేశాడు. తల్లి తలపై సుత్తితో బలంగా కొట్టాడు. దీంతో ఐలమ్మ తల చితికి అక్కడికక్కడే పడిపోయింది. రక్తపు మడుగులో పడిఉన్న ఐలమ్మను స్థానికులు ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. అయితే, ఆమె మార్గం మధ్యలో కన్నుమూసింది.
శ్రీకాంత్ మద్యానికి బానిసై తరచు తల్లి ఐలమ్మను డబ్బులు కోసం వేధించేవాడని స్థానికులు చెప్పారు. అయితే, ఈ విషయంపై ఇవాళ ఉదయం శ్రీకాంత్, ఐలమ్మలకు మధ్య వివాదం జరిగింది. ఈ క్రమంలో మద్యం మత్తులో ఉన్న శ్రీకాంత్ తల్లి తలపై సుత్తితో బలంగా కొట్టాడు. దీంతో ఆమె మరణించింది.
స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకొని ఐలమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే, నిందితుడు శ్రీకాంత్ మంచాల పోలీస్ స్టేషన్ లో పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.