తెలంగాణ ప్రభుత్వ ఐటీ శాఖ, టాస్క్, నెక్స్ట్ వేవ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ (NIAT) సంయుక్తంగా నిర్వహించిన ‘బిల్డ్ ఫర్ తెలంగాణ హ్యాకథాన్’ విజయవంతంగా ముగిసింది. రెండు రోజుల పాటు జరిగిన ఈవెంట్‌లో 150పైగా టీమ్‌లు, 600కుపైగా విద్యార్థులు పాల్గొన్నారు. ప్రజా సమస్యలకు వినూత్న టెక్నాలజీ పరిష్కారాలను అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
టాప్-3 టీమ్‌లు… కౌశిక్-అఖిల, నిఖిల్-వేణు గోపాల్, మురళీ కృష్ణ-అవినాశ్ గుప్తా విజేతలుగా నిలిచారు. టాప్-10 టీమ్‌లకు రూ.3 లక్షల నగదు బహుమతులు, మెంటార్షిప్, ఇంక్యుబేషన్, ఫండింగ్ అవకాశాలు లభించాయి.
NIAT ఇప్పటికే 200కి పైగా కాలేజీల్లో 55,000 మందికిపైగా విద్యార్థులకు ట్రైనింగ్ ఇచ్చింది. వచ్చే 6 నెలల్లో మరింత మందికి నైపుణ్యాలు అందించాలన్నదే లక్ష్యం. విద్యా రంగం-పరిశ్రమల మధ్య గ్యాప్‌ను తగ్గిస్తూ, యువతను ఉద్యోగార్హత కలిగిన టెక్ లీడర్లుగా తీర్చిదిద్దుతోంది.
AI రంగంలో 24,000 మందికి శిక్షణ, 101 వర్క్‌షాపులు, 32,000 మందికి ఎంప్లాయబిలిటీ టెస్టులు నిర్వహించారు. ‘ఇంపాక్ట్ కోసం ఇంజినీరింగ్’ మోడల్ ద్వారా విద్యా సంస్థలు-ఇండస్ట్రీ భాగస్వామ్యాన్ని పెంచుతోంది.
హ్యాకథాన్‌లో రూపొందించిన ఏఐ ప్రాజెక్టులు ఆకట్టుకున్నాయని టాస్క్ సీఈవో శ్రీకాంత్ సిన్హా తెలిపారు. ముఖ్యమంత్రి లక్ష్యమైన తెలంగాణను AI కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతోందన్నారు. కాగా, 2024లో ప్రభుత్వ ఐటీ డిపార్ట్మెంట్‌తో ఒప్పందం తర్వాత తెలంగాణలో టెక్ ప్రతిభను పెంపొందించడంలో NIAT కీలక పాత్ర పోషిస్తోంది.
బిల్డ్ ఫర్ తెలంగాణ హ్యాకథాన్.. ప్రజా సమస్యలకు టెక్, ఇన్నోవేటివ్ పరిష్కారాలు | 10TV#TelanganaHackathon #NIAT #Telangana #10TV pic.twitter.com/vblT3KTXps
— 10Tv News (@10TvTeluguNews) June 29, 2025