ఇన్ఫినిక్స్ నుంచి మార్కెట్లో తక్కువ ధరకు స్మార్ట్‌ఫోన్.. మార్కెట్‌ను ఊపేసే ఛాన్స్.. ఎందుకంటే?
ఇలా అన్ని రకాలుగా యూజర్లను ఆకర్షిస్తోంది.

మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఇన్ఫినిక్స్ మరోసారి తన హవా కొనసాగిస్తోంది. ఇన్ఫినిక్స్ నోట్ 50ఎస్ 5జీ+ స్మార్ట్‌ఫోన్ సేల్స్ భారత్‌లో ఇప్పటికే ప్రారంభమైన విషయం తెలిసిందే. స్టైలిష్, పవర్‌ఫుల్, ధర తక్కువ, తేలికైన ఫోన్.. ఇలా అన్ని రకాలుగా యూజర్లను ఆకర్షిస్తోంది. దీంతో మార్కెట్‌ను షేక్ చేసే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.
డిస్‌ప్లే, డిజైన్
ఫోన్ లుక్, డిస్‌ప్లే విషయానికి వస్తే ఇన్ఫినిక్స్ నోట్ 50ఎస్ 5జీ+ ఆకట్టుకుంటుంది. 6.78-ఇంచ్ 3డీ కర్వ్డ్ అమోల్‌డ్ డిస్‌ప్లేతో వచ్చింది. ఇది ఫుల్ హెచ్‌డీ+ రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ పీక్స్ బ్రైట్‌నెస్‌తో అందుబాటులో ఉంది. గేమింగ్ లేదా యూట్యూబ్‌లో హెచ్‌డీఆర్ వీడియో చూసినా విజువల్స్ చాలా క్లీన్ గా కనిపిస్తాయి. పైగా డిస్‌ప్లేకు కార్నింగ్ గోరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉంటుంది.
పర్ఫార్మెన్స్
ఫోన్ లోపల మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్టిమేట్ ప్రొసెసర్ ఉపయోగించారు. ఇది 4ఎన్‌ఎం టెక్నాలజీపై తయారైంది. ఫోన్ 6జీబీ, 8జీబీ ర్యామ్ ఆప్షన్లలో వచ్చింది. పైగా 8జీబీ వరకు వర్చువల్ ర్యామ్ ఉపయోగించొచ్చు. స్టోరేజ్ 128జీబీ, 256జీబీ ఆప్షన్లలో ఉంది. ఇవి యూఎఫ్‌ఎస్ 3.1 టెక్నాలజీతో ఫాస్ట్ యాప్స్ ఓపెన్ అవుతాయి, ఫైల్ ట్రాన్స్‌ఫర్ వేగంగా జరుగుతుంది.
కెమెరా
ఇన్ఫినిక్స్ నోట్ 50ఎస్ 5జీ+ కెమెరా సెటప్ వెనుక భాగంలో 64ఎంపీ సోనీ ఐఎమ్ఎక్స్682 ప్రైమరీ కెమెరా వస్తుంది. దీనికి ఓఐఎస్ సపోర్ట్ ఉంటుంది. మరో 2ఎంపీ సెకండరీ కెమెరా ఉంటుంది. ముందు భాగంలో 13ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. కెమెరా యాప్‌లో ఏఐ ఈరేసర్, సూపర్ నైట్ మోడ్, టైమ్‌ల్యాప్స్, డ్యూయల్ వీడియో, 4కే వీడియో రికార్డింగ్ ఫీచర్లు ఉన్నాయి.
బ్యాటరీ, చార్జింగ్
ఇన్ఫినిక్స్ నోట్ 50ఎస్ 5జీ+ లో 5500ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఒక్కసారి చార్జ్ చేస్తే రోజంతా స్మూత్‌గా పని చేస్తుంది. 45వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. కంపెనీ ప్రకారం ఫోన్ వేగంగా చార్జ్ అవుతుంది. 10వాట్ రివర్స్ చార్జింగ్, బైపాస్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. చార్జింగ్ సమయంలో ఫోన్ వేడి కావడం తగ్గుతుంది.
డిజైన్, సౌండ్
ఫోన్ వెయిట్ కేవలం 180 గ్రాములు ఉంటుంది. హ్యాండ్‌లో పెరఫెక్ట్‌గా ఫిట్ అవుతుంది. ప్రత్యేకంగా దీని మరిన్ డ్రిఫ్ట్ బ్లూ కలర్ వేరియంట్‌లో “ఎనర్జైజింగ్ సెంట్ టెక్” ఉంటుంది. బ్యాక్ ప్యానెల్‌లో లైట్ సెంటు ఉంటుంది.. ఇది కొత్త ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుంది.
సాఫ్ట్‌వేర్, సెక్యూరిటీ
ఫోన్‌లో ఆండ్రాయిడ్ 15 ఓఎస్ మీద ఇన్ఫినిక్స్ ఎక్స్‌ఓఎస్ 15 స్కిన్ ఉంటుంది. కంపెనీ రెండు సంవత్సరాలు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్, మూడు సంవత్సరాలు సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇస్తుంది. సెక్యూరిటీ కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్లు ఉంటాయి.
కనెక్టివిటీ
ఫోన్ 5జీ ఎస్‌ఏ / ఎన్‌ఎస్‌ఏ నెట్‌వర్క్ సపోర్ట్ ఇస్తుంది. డ్యూయల్ 4జీ వోల్టీ, వైఫై 6, బ్లూటూత్ 5.4, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సి వంటి అవసరమైన అన్ని కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. ఐపీ64 రేటింగ్ ద్వారా ఫోన్ ధూళి, నీటి స్ప్లాష్‌ల నుంచి రక్షణ కల్పిస్తుంది. ఎంఐఎల్-స్టాండర్డ్ 810హెచ్ సర్టిఫికేషన్ ఫోన్‌ను చిన్న షాక్స్ నుంచి రక్షిస్తుంది.
ధర
ఇన్ఫినిక్స్ నోట్ 50ఎస్ 5జీ+ మూడు స్టోరేజ్ వేరియంట్లలో లభ్యమవుతోంది. 6జీబీ + 128జీబీ ధర రూ.14,999, 8జీబీ + 128జీబీ ధర రూ.15,999, టాప్ వేరియంట్ 8జీబీ + 256జీబీ ధర రూ.17,999. ఈ ఫోన్ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల్లో దొరుకుతుంది.