KA Paul
KA Paul: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఓ యువతి ఆయన పై ఫిర్యాదు చేసింది. తనను లైంగికంగా వేధించారంటూ బాధితురాలు హైదరాబాద్ షీ టీమ్స్‌కు ఫిర్యాదు చేయగా.. పంజాగుట్ట పీఎస్ కు కేసు అప్పగించారు. దీంతో పంజాగుట్ట స్టేషన్లో కేఏ పాల్ పై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
బాధితురాలు కేఏ పాల్ కంపెనీలో కొద్దిరోజులుగా నైట్ షిప్టులో అమెరికన్ కో-ఆర్డినేటర్‌గా పనిచేస్తుంది. ఈ క్రమంలో కేఏ పాల్ ఆ యువతికి దగ్గరగా ఆనుకొని, ఆమె వీపుపై చేయి తగిలించాడని ఫిర్యాదులో పేర్కొంది. తనను లైంగికంగా వేధించాడని యువతి ఫిర్యాదులో పేర్కొంది. లైంగిక వేధింపులకు సంబంధించిన ఆధారాలను షీ టీమ్స్ కు అందించినట్లు బాధితురాలు తెలిపింది. ఈ నేపథ్యంలో షీ టీమ్ సిబ్బంది కేసును పంజాగుట్ట పోలీసులకు ట్రాన్స్‌ఫర్ చేయగా.. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్త్తు చేస్తున్నారు.
పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదుపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకునే ప్రయత్నంలో భాగమని అన్నారు. బాధ్యులపై పరువు నష్టం దావా వేస్తానని పాల్ పేర్కొన్నారు.