Ministers Controversy: కొత్త టర్న్ తీసుకున్న వరంగల్ ఎపిసోడ్.. మంత్రి పొంగులేటిపై ఇద్దరు మహిళా మంత్రులు ఫిర్యాదు.. పీసీసీ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
మంత్రి పొంగులేటిపై ఇద్దరు మహిళా మంత్రులు సీతక్క, కొండా సురేఖ తనకు ఫిర్యాదు చేశారని తెలిపిన మహేశ్ కుమార్ గౌడ్.. ఈ సమస్యను

Ministers Controversy: మంత్రుల మధ్య వివాదం ముదురుతోంది. వరంగల్ ఎపిసోడ్ కొత్త టర్న్ తీసుకుంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై ఇద్దరు మహిళా మంత్రులు సీతక్క, కొండా సురేఖ ఫిర్యాదు చేశారు.
తెలంగాణ మంత్రుల మధ్య చెలరేగిన వివాదంపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. మంత్రుల మధ్య మనస్పర్థలు తమ కుటుంబ సమస్య లాంటిదన్నారు. మంత్రులు సీతక్క, కొండా సురేఖ తనతో మాట్లాడారని తెలిపారు. సమాచారం లోపం వల్ల చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయని, వాటిని పెద్దవి చేసి చూపొద్దని కోరారు. సీఎం రేవంత్ తో మాట్లాడి అన్ని సమస్యలను పరిష్కరిస్తానని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.
మంత్రి పొంగులేటిపై ఇద్దరు మహిళా మంత్రులు సీతక్క, కొండా సురేఖ తనకు ఫిర్యాదు చేశారని తెలిపిన మహేశ్ కుమార్ గౌడ్.. ఈ సమస్యను తాను, సీఎం రేవంత్ పరిష్కరిస్తామన్నారు.
వరంగల్ ఎపిసోడ్ కొత్త టర్న్ తీసుకుంది. నిన్నటివరకు కొండా సురేఖ.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై ఫిర్యాదు ఇచ్చారని భావించారు. కానీ, కొండా సురేఖతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన సీతక్క కూడా కంప్లైంట్ ఇచ్చినట్లు పీసీసీ చీఫ్ తెలిపారు. మేడారం జాతరకు సంబంధించిన అంశంలో మంత్రుల మధ్య వివాదం తలెత్తింది. మేడారం జాతర పూర్తిగా సీతక్క నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. కొండా సురేఖ దేవాదాయ శాఖ పరిధిలోకి వస్తుంది.
ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ఇంఛార్జ్ మంత్రి హోదాలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అక్కడ దాదాపు 71 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన పనులను తన అనుచరులకు కట్టబెట్టాలని ప్లాన్ చేశారని మహిళా మంత్రులు ఫిర్యాదు చేశారు. దేవాదాయ శాఖ పరిధిలోకి వచ్చే పనులకు సంబంధించి పొంగులేటి జోక్యం చేసుకుంటున్నారు అంటూ కంప్లైంట్ ఇచ్చారు. మంత్రి పొంగులేటిపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖ రాయడంతో పాటు పీసీసీ చీఫ్, సీఎం రేవంత్ కి ఫిర్యాదు చేశారు మంత్రి కొండా సురేఖ.
దీనిపై స్పందించిన పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్.. సీఎంతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానన్నారు. కాగా, ఇటీవల మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్ మధ్య వివాదం విషయంలోనూ మహేశ్ కుమార్ గౌడ్ జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించారు. మంత్రులు పొన్నం, అడ్లూరి మధ్య రాజీ కుదర్చడంలో ఆయన కీ రోల్ ప్లే చేశారు.