వార్నీ.. లేడీ గెటప్‌లో స్నేహితుడి ఇంట్లోకి.. ప్లాన్ ప్రకారం పని పూర్తి.. కానీ, ఆ తరువాతే అసలు ట్విస్ట్.. దెబ్బకు దిమ్మతిరిగింది..
Hyderabad : లేడీ గెటప్ వేసుకొని స్నేహితుడి ఇంట్లోకి ఓ వ్యక్తి చొరబడి భారీ మొత్తంలో బంగారం, నగదును చోరీ చేశాడు.

Theft in Hyderabad
Theft in Hyderabad : లోన్ యాప్ ద్వారా డబ్బులు తీసుకొని జల్సాలకు అలవాటు పడిన ఓ వ్యక్తి.. తన అప్పులు తీర్చేందుకు స్నేహితుడి ఇంట్లోనే దొంగతనం చేసేందుకు ప్లాన్ వేశాడు. లేడీ గెటప్ వేసుకొని స్నేహితుడి ఇంట్లోకి చొరబడి భారీ మొత్తంలో బంగారం, నగదును చోరీ చేశాడు. అయితే, చోరీ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్ బంజారాహిల్స్ పరిధిలోని ఉదయనగర్‌లో ఈనెల 16వ తేదీన చోరీ జరిగింది. లింగపల్లి సిసి సమరలో టెక్నిషియన్ గా పనిచేస్తున్న హర్షిత్ అనే యువకుడు స్నేహితుడు శివరాజ్ ఇంట్లో చోరీకి పాల్పడ్డాడు.
శివరాజ్, హర్షిత్ స్నేహితులు. హర్షిత్ లోన్ యాప్ ద్వారా డబ్బులు తీసుకొని జల్సాలు చేశాడు. అప్పు తీర్చేందుకు చోరీకి పాల్పడాలని భావించాడు. ఇదే సమయంలో అతని స్నేహితుడు శివరాజ్ .. తన ఇంట్లో వాళ్లు ఊరికెళ్లారని చెప్పాడు. లోన్ యాప్ ద్వారా అప్పులు తీసుకున్న హర్షిత్.. వాటిని తీర్చాలంటే శివరాజ్ ఇంట్లో దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం ఓ ప్లాన్ వేసుకున్నాడు. లేడీ గెటప్‌లో వెళ్లి చోరీ చేయాలని అనుకున్నాడు.
శివరాజ్ కుటుంబంతో నిజామాబాద్ వెళ్లగా.. బంజారాహిల్స్ ఉదయనగర్‌లోని శివరాజ్ ఇంటి వద్దకు లేడీ గెటప్‌లో హర్షిత్ వెళ్లాడు. ఇంటి తాళాలు పగలగొట్టి 6.75 తులాల బంగారం, 1.10 లక్షల నగదు చోరీ చేశాడు. ఇంట్లో చోరీ జరిగిన విషయాన్ని శివరాజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
శివరాజ్ ఇంట్లో, పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. లేడీ గెటప్‌లో ఇంట్లోకి చొరబడిన వ్యక్తి.. ఈ ఇంటికి సంబంధించిన విషయాలు తెలిసిన వ్యక్తి అయి ఉంటాడని పోలీసులు భావించారు. ఆ మేరకు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో హర్షిత్ పై అనుమానం వచ్చింది. దీంతో అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా.. దొంగతనం తానే చేశానని, లోన్ యాప్‌లో తీసుకున్న రుణం చెల్లించడానికి ఇలా చేశానని చెప్పాడు. నిందితుడి వద్ద నుంచి రూ.6.75 తులాల బంగారం, 85వేల నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు.. అతన్ని రిమాండ్ కు తరలించారు.