Hijab Controversy
Case Registered Management School : హైదరాబాద్ హయత్ నగర్ హిజాబ్ వివాదంలో జీ స్కూల్ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. స్కార్ఫ్ తో వచ్చిన విద్యార్థినిని స్కూల్ యాజమాన్యం ఇంటికి పంపించింది. బాధిత విద్యార్థిని హయత్ నగర్ కోర్టు న్యాయమూర్తి కూతురు కావడం గమనార్హం. ఈ ఘటనపై విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యార్థిని స్టేట్ మెంట్ ఆధారంగా స్కూల్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు.
హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పదో తరగతి చదువుతున్నటువంటి విద్యార్థినిని జీ స్కూల్ యాజమాన్యం స్కార్ఫ్ కట్టుకున్నందుకు స్కూల్ నుండి వెంటనే ఇంటికి పంపించింది. హిజాబ్ అనేది ఈ స్కూల్ లో నిషేధం కాబట్టి స్కార్ఫ్ కట్టుకోని రావడానికి వీళ్లేదంటూ విద్యార్థినికి పలుమార్లు స్కూల్ యాజమాన్యం చెప్పినప్పటికీ కూడా విద్యార్థిని స్కార్ఫ్ కట్టుకొని స్కూల్ కు వచ్చారు. వెంటనే అక్కడున్న ఉపాధ్యాయులు విద్యార్థినిని బయటకు పంపించారు.
Road Accident : కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
అయితే జరిగిన విషయం విద్యార్థిని తన తల్లిదండ్రులకు చెప్పారు. విద్యార్థిని తల్లిదండ్రులు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. హిజాబ్ పేరుతో విద్యార్థినిని బయటకు పంపించారని పేర్కొన్నారు. విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు సెక్షన్ 290తోపాటు 298, 352 సెక్షన్ల కింద స్కూల్ యాజమాన్యంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.