తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి..ప్రధానంగా హైదరాబాద్ లో పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న దృష్ట్యా నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు సీఎం కేసీఆర్. ప్రస్తుతం వైరస్ వ్యాపించకుండా అమలవుతున్న నిబంధనలు కంటిన్యూ చేయాలని, ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని తెలిపారు. నగరంలో ప్రకటించిన కంటైన్ మెంట్ ప్రాంతాల్లో ఎవరూ బయటకు రావొద్దని, అధికారులకు సహరించాలన్నారు.
వైరస్ వ్యాప్తి, తీసుకుంటున్న చర్యలపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. 2020, ఏప్రిల్ 18వ తేదీ శనివారం..ప్రగతి భవన్ లో ఈ సమావేశం నిర్వహించారు. వైరస్ సోకిన వారితో ఎంత మందికి ప్రభావితమైందో కచ్చితంగ లెక్కించాలని, ఎంతమందికైనా..చికిత్స చేయడానికి, పరీక్షలు నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. హైదరాబాద్ నగరంలో కేసులు పెరుగుతున్న దృష్ట్యా వ్యూహాత్మకంగా వ్యవహరించాలని సీఎం సూచించారు.
కరోనా పాజిటివ్ కేసులుర నమోదైన ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉంటూ..ప్రజలకు సలాహాలు, సూచనలు అందించాలన్నారు. ఒకవేళ ఎవరికైనా ఆపద, ఇబ్బంది ఉంటే..వెంటనే అధికారులు స్పందించాలని, పేదలకు ఇబ్బంది కలుగకుండా చూడాలన్నారు. వలస కూలీలు, దినసరి కార్మికులు ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే..వారిని త్వరగా గుర్తించి..సహాయం అందించాలన్నారు. వ్యవసాయ పనులు యదావిధిగా జరిగే విధంగా చూడాలని సూచించారు.
Also Read | పరామర్శ ఎంత పనిచేసింది : హైదరాబాద్ లో ఒక్క వ్యక్తి ద్వారా 34 మందికి కరోనా