Telangana Assembly Election 2023 : బీఆర్ఎస్ నేతలపై ఎన్నికల ఉల్లంఘన కేసులు ..

పలువురు బీఆర్ఎస్ నేతలు పోలింగ్ సమయంలో ఎన్నికల ఉల్లంఘనకు పాల్పడ్డారు అంటూ కేసులు నమోదు అయ్యాయి.

Election Code Violation Cases registered : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. నేతలంతా ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.ఈ క్రమంలో పలువురు బీఆర్ఎస్ నేతలు పోలింగ్ సమయంలో ఎన్నికల ఉల్లంఘనకు పాల్పడ్డారు అంటూ కేసులు నమోదు అయ్యాయి. నిన్న కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ..సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత ఎన్నికల ఉల్లంఘన చేశారంటూ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే మంత్రి ఇంద్రకరణ్ రె్డ్డిపై కూడా కోడ్ ఉల్లంఘన కేసు నమోదు చేశారు. ఎన్నికల నిబంధనలు పాటించాల్సిన నేతలే కోడ్ ఉల్లంఘిస్తు తమ పార్టీ కండువాలు వేసుకుని ఓటు వేయటానికి వెళ్లారంటూ కేసులు నమోదు అయ్యాయి. దీంట్లో భాగంగానే మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిపై కూడా కేసు నమోదు చేశారు. ఇంద్రకరణ్ రెడ్డి ఎల్లపెల్లి పోలింగ్ కేంద్రంలోకి బీఆర్ఎస్ కండువా వేసుకుని ఓటు వేశారని ప్లయింగ్ స్క్వాడ్ అధికారులు ఫిర్యాదు చేయటంతో ఆయనపై కేసు నమోదు చేశారు.

గెలిచిన అభ్యర్ధులను కాపాడుకునేందుకు .. కర్ణాటక క్యాంప్ రాజకీయాలకు టీ.కాంగ్రెస్ ప్లాన్..

అలాగే మంచిర్యాల జిల్లాలో గులాబీ నేత ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై కూడా కోడ్ ఉల్లంఘన కేసు నమోదు అయ్యింది. చిన్నయ్య నెన్నెల్ల మండలం జెండా వెంకటాపూర్ పోలింగ్ కేంద్రంలోకి బీఆర్ఎస్ కండువా ధరించి ఓటు వేశారు. దీనిపై ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై ప్రిసైడింగ్ అధికారి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.చిన్నయ్య ఓటు వేస్తుంటే ఆయన అనుచరులు ఫోటోలు, వీడియోలు తీశారని..ఓటు వేసిన తరువాత ఆయన సీఎం కేసీఆర్ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని..కాబట్టి అందరు కారు గుర్తుకు ఓటు వేయాలని పిలుపునిచ్చారరు. దీంతో ఆయనపై కేసు నమోదు చేశారు.

కాగా..సామాన్యులు ఓటు వేయటానికి పోలింగ్ కేంద్రాలకు వెళ్లే సమయంలో పోలీసులు..సంబంధిత అధికారులు చెక్ చేసి పంపిస్తుంటారు. మరి రాజకీయ నేతల విషయంలో అందులోను అధికారంలో ఉన్న నేతలే ఇలా కోడ్ ఉల్లంఘనకు పాల్పడితే పోలీసులు, అధికారులు ఏం చేస్తున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిబంధనలు పాటించాల్సినవారే ఇలా ఉల్లంఘన చేస్తారా..? అంటూ విమర్శలు వస్తున్నాయి.

ట్రెండింగ్ వార్తలు