Telangana Congress : గెలిచిన అభ్యర్ధులను కాపాడుకునేందుకు కర్ణాటక క్యాంప్ రాజకీయాలకు టీ.కాంగ్రెస్ ప్లాన్..

గెలుపుపై ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్న టీ.కాంగ్రెస్ ఇక కర్ణాటక క్యాంపు రాజకీయాలకు తెరలేపింది. గెలిచిన ఎమ్మెల్యేలను కాపాడుకునే యత్నంలో పడింది.

Telangana Congress : గెలిచిన అభ్యర్ధులను కాపాడుకునేందుకు కర్ణాటక క్యాంప్ రాజకీయాలకు టీ.కాంగ్రెస్ ప్లాన్..

revanth reddy

Telangana : తెలంగాణలో పోలింగ్ పర్వం ముగిసింది. ఇక గెలుపుపై నమ్మకం పెట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు అధికారంలోకి వచ్చేది తామే అనే ధీమాతో ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఎగ్జిట్ పోల్స్ తరువాత కాంగ్రెస్ మరింత ధీమాగా ఉంది. మరోపక్క బీఆర్ఎస్ ఎగ్జిట్ పోల్స్ ఉత్త ట్రాష్ అంటూ కొట్టిపారేస్తోంది. ఈక్రమంలో గెలుపుపై ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్న టీ.కాంగ్రెస్ ఇక కర్ణాటక క్యాంపు రాజకీయాలకు తెరలేపింది. గెలిచిన ఎమ్మెల్యేలను కాపాడుకునే యత్నంలో పడింది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై పలు సర్వే సంస్థలు విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ సంచలనంగా మారాయి. ఒక్కో సంస్థ ఒక్కో రకంగా ఫలితాన్ని అంచనా వేసింది. కొన్ని సంస్థలు మరోసారి బీఆర్ఎస్ దే గెలుపు, హ్యాట్రిక్ విజయం ఖాయం అని అంచనా వేయగా.. మరికొన్ని సంస్థలు కాంగ్రెస్ కు పట్టం కట్టాయి. ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అని అంచనా కట్టాయి. దీంతో కాంగ్రెస్ గెలిచిన ఎమ్మెల్యేలను కాపాడుకునే యత్నంలో బిజీ బిజీగా ఉంది. ఓ పక్క గెలుస్తామనే ధీమాగా ఉన్నా..మరోపక్క కర్ణాటక రాజకీయ క్యాంపు రాజకీయాల ప్లాన్ లను షురూ చేస్తోంది.

ఎంత రాత్రి అయినా ఇవాళే వెల్లడించాలి- ఈసీకి రేవంత్ రెడ్డి డిమాండ్

దీంట్లో భాగంగానే ఫలితాలు వెలువడిన తరువాత గెలిచిన ఎమ్మెల్యే అభ్యర్ధులను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సమయం వరకు ఓ చోట రహస్యంగా దాచిపెట్టేందుకు యత్నాలు చేస్తోంది. కర్ణాటకలోని చిక్బల్లాపూర్ లేదా మరోచోట క్యాంపు ఏర్పాటు చేసి వారిని అక్కడికి తరలించే ఏర్పాట్లలో నిమగ్నమైంది.

బీఆర్ఎస్ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగిందని మొదటినుంచి చెబుతున్న టీ కాంగ్రెస్ దాన్ని తనకు అనుకూలంగా మలచుకోవటంలో దాదాపు సక్సెస్ అయ్యిందనే ధీమాతో ఉంది. దీంతో తమకు 70కు పైగా సీట్లలో విజయం సాధిస్తామని చెబుతు వచ్చింది. ఈక్రమంలో పోలింగ్ పూర్తి అయ్యింది. ఎగ్జిట్ పోల్స్ లో కూడా కాంగ్రెస్ దే హవా అనే విషయం వెల్లడైంది. దీంతో ఓ పక్క తమదే అధికారం అనే ధీమా ఉన్నా..గెలిచినవారిని కాపాడుకుకోవాలనే ముందు చూపుతో వారిని వేరే ప్రాంతానికి తరలించే ఏర్పాట్లు కూడా చేసుకుంటోంది.

ఒక వేళ హంగ్‌ వస్తే పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోవడంపైనా దృష్టి పెట్టింది. గెలిచేందుకు ఆస్కారం ఉన్న అభ్యర్థులను ప్రత్యేక విమానాల్లో బెంగళూరుకు తరలించే ప్లాన్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఫలితాలు వెలువడిన వెంటనే ఏ క్షణంలోనైనా బెంగళూరుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని అభ్యర్థులను పార్టీ నాయకత్వం అప్రమత్తం చేసినట్లు సమాచారం. కర్ణాటకలో కాంగ్రెస్‌ అధికారంలో ఉంది కాబట్టి అక్కడైతేనే తమ అభ్యర్ధులు సేఫ్ గా ఉంటారని భావిస్తోంది. ఇక అక్కడ కర్ణాటక కాంగ్రెస్ గెలుపులో కీలక పాత్ర వహించిన డీకే శివకుమార్ ఉండనే ఉన్నారు. దీంతో ఈ క్యాంపు ఆపరేషన్‌ శివకుమార్‌ నేతృత్వంలో నడుస్తున్నట్లు సమాచారం. మరీ ముందు చూపుతో ఫలితాలు వెలువడకుండానే గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థులకు పార్టీ నుంచి బాధ్యులను నియమించి.. సదరు అభ్యర్థులు గెలిచినట్లుగా క్లారిటీ తీసుకున్న వెంటనే కర్ణాటక తరలించే చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

ఎగ్జిట్ పోల్స్‌లో నిజమెంత? ప్రజాతీర్పును నిర్ధారిస్తాయా? 2018లో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటే

ఒకవేళ అంచనాలు తల్లకిందులైన రాష్ట్రంలో హంగ్‌ వస్తే గతంలో వలెనే కేసీఆర్‌ తన మార్కు రాజకీయాన్ని తెరపైకి తెచ్చే చాన్స్‌ ఉందని టీ.కాంగ్రెస్‌ నేతలు భావించి ఇలా క్యాంపు రాజకీయాలకు తెరలేపుతున్నట్లుగా తెలుస్తోంది. దీంట్లో భాగంగానే తమ అభ్యర్థుల్ని క్యాంపులకు తరలించాలని ప్లాన్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది.