Revanth Reddy : ఎంత రాత్రి అయినా ఇవాళే వెల్లడించాలి- ఈసీకి రేవంత్ రెడ్డి డిమాండ్

గత తప్పిదాలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అదే సమయంలో పార్టీ కార్యకర్తలకు కీలక విజ్ఞప్తి చేశారు రేవంత్ రెడ్డి.

Revanth Reddy : ఎంత రాత్రి అయినా ఇవాళే వెల్లడించాలి- ఈసీకి రేవంత్ రెడ్డి డిమాండ్

Revanth Reddy

Updated On : November 30, 2023 / 11:54 PM IST

ఎంత రాత్రి అయినా సరే పోలింగ్ ఎంత శాతం నమోదైంది అన్న వివరాలను ఇవాళే వెల్లడించాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. అలాగే, గత తప్పిదాలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అదే సమయంలో పార్టీ కార్యకర్తలకు కీలక విజ్ఞప్తి చేశారు రేవంత్ రెడ్డి. పోలింగ్ ముగిసే వరకు, ఈవీఎంలు సీల్ చేసి స్ట్రాంగ్ రూమ్ లకు చేరే వరకు అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లు, కార్యకర్తలను కోరారు రేవంత్ రెడ్డి.

Also Read : తెలంగాణలో గెలిచేది ఈ పార్టీనే..! ఎగ్జిట్ పోల్స్ సంచలన ఫలితాలు

69.05శాతం పోలింగ్ నమోదు..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ముగిసింది. చెదురుమదురు ఘటనలు మినహా రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా సాయంత్రం 5గంటలకు ముగిసింది. కాగా, 5గంటలకు ముందే క్యూలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. ఇక పోలింగ్ శాతానికి వస్తే.. మొత్తం 69.05 శాతం ఓటింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. అన్ని నియోజకవర్గాల్లోనూ పోలింగ్ ముగిసింది. దీంతో ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ లకు తరలిస్తున్నారు.

Also Read : ఎగ్జిట్ పోల్స్‌లో నిజమెంత? ప్రజాతీర్పును నిర్ధారిస్తాయా? 2018లో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటే