10టీవీ ఫుడ్‌ ఫ్యూజన్‌ అవార్డ్స్‌-2025… ఇవాళ అవార్డుల ప్రదానోత్సవం

ఏ రెస్టారెంట్‌ అద్భుతమైన యాంబియన్స్ అందిస్తోంది? వెజిటేరియన్ వంటకాల్లో ఎవరు దుమ్మురేపుతున్నారు?

10TV FOOD FUSION AWARDS 2025

రుచుల పండుగను అందిస్తున్న రెస్టారెంట్లు, చవులూరించే డిష్‌లతో ఆశ్చర్యపరచే వెరైటీలు.. “వావ్!” అనిపించే టేస్ట్‌లు.. ఇటువంటి అన్ని రకాల వెరైటీలను గర్వంగా అందిస్తున్నాయి మన హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్‌ సెంటర్లు, క్యాఫెటీరియాలు, బేకరీస్. వీటన్నింటికీ పట్టం కడుతున్న వేడుకే 10టీవీ ఫుడ్‌ ఫ్యూజన్‌ అవార్డ్స్ 2025.

పర్యాటక-సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చేతులమీదుగా, టాలీవుడ్ యువ, డైనమిక్ డైరెక్టర్ అనిల్‌ రావిపూడి సమక్షంలో ఈ వేడుక జరిగింది. మరికొందరు సెలబ్రిటీలు కూడా ఇందులో సందడి చేశారు. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు, రేపు ఉదయం 10 గంటలకు 10టీవీలో ప్రసారం కానుంది.

ఏ రెస్టారెంట్‌ అద్భుతమైన యాంబియన్స్ అందిస్తోంది?

వెజిటేరియన్ వంటకాల్లో ఎవరు దుమ్మురేపుతున్నారు?

బెస్ట్ వెడ్డింగ్ క్యాటరర్లు ఎవరు?

అత్యంత సాంప్రదాయిక తెలుగు కిచెన్ ఏది?

ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం దొరకనుంది.

మొత్తం 50కిపైగా విభాగాల్లో జడ్జిలు చెక్ చేసి, టాప్‌లో నిలిచిన వారికి అవార్డులు 10టీవీ ఈ అవార్డులను అందిస్తోంది. గొప్ప ఫుడ్‌-వేదికల కృషికి ఇదో గౌరవం. ఎవరు ఏ కేటగిరీలో తొలి స్థానం దక్కించుకున్నారో, ఎవరి వంట ‘వారెవ్వా!’ అనిపించిందో – ఇవాళ సాయంత్రం 10టీవీలో చూసి తెలుసుకోండి..