Etala, Arvind Security : ఈటలకు వై ప్లస్, అర్వింద్‌కు వై కేటగిరీ భద్రత.. ఇద్దరికి బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు

తెలంగాణలోని తమ నేతల భద్రత విషయంలో బీజేపీ అధిష్టానం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ఇద్దరు బీజేపీ నేతలకు కేంద్రం ప్రత్యేక భద్రత కల్పించింది. ఒకరికి వై ప్లస్ కాటగిరీ, మరొకరికి వై కాటగిరి భద్రతను కల్పిస్తు ఉత్తర్వులు జారీ చేసింది.

MLA Etala MP, Arvind Security

Y Category Security For Etala, Arvind : తెలంగాణలోని తమ నేతల భద్రత విషయంలో బీజేపీ అధిష్టానం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ఇద్దరు బీజేపీ నేతలకు కేంద్రం భద్రత కల్పించింది. తెలంగాణలో త్వరలోనే ఎన్నికలు జరుగనున్న క్రమంలో తమ నేతల భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీంట్లో భాగంగా హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Eatala Rajender), నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ (Arvind Dharmapuri )కు సీఆర్‌పీఎఫ్(Central Reserve Police Force) భద్రత కల్పించింది. దీనికి సంబంధించి కేంద్రం సోమవారం (జులై 10,2023) ఉత్తర్వులు జారీ చేసింది.

ఈటల రాజేందర్ కు వై ప్లస్ కేటగిరీ భద్రతతో పాటు ధర్మపురి అరవింద్ కు వై కేటగిరీ భద్రతను కల్పించనుంది కేంద్రం. వై ప్లస్ కేటగిరీ కింద 11 మంది, వై కేటగిరీ కింద 8 మందితో భద్రత కల్పించనున్నారు. అలాగే ఇద్దరికీ బుల్లెట్ ప్రూఫ్ వాహానాలను కేటాయించింది. దీంతో ఈ ఇద్దరు బీజేపీ నేతల నివాసాలకు సీఆర్ఫీఎఫ్ ఉన్నతాధికారులు వెళ్లి పరిస్థితిని సమీక్షించనున్నట్లుగా సమాచారం.

కాగా.. ఇటీవల ఈటల భార్య జమున తన భర్తను చంపేందుకు కుట్ర జరుగుతోందని.. మీడియాతో చెప్పిన విషయం తెలిసిందే. తనకు ప్రాణహాని ఉందని స్వయంగా ఈటల రాజేందర్ కూడా వెల్లడించారు. దీంతో కేంద్రం స్పందించి ఆయనకు వై ప్లస్ కాటగిరి భద్రతను కల్పించింది.

Also Read: జగన్‌ను నేను కలవలేదు.. షర్మిల చేరిక విషయంపై క్లారిటీ ఇచ్చిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి