Central govt team
Telangana Flood Affected Areas : తెలంగాణకు సోమవారం కేంద్ర బృందం రానుంది. రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఈ బృందం సభ్యులు పర్యటించనున్నారు. వర్షాలు, వరదలతో జరిగిన నష్టాన్ని అంచనా వేయనున్నారు. రాష్ట్రంలో వారం రోజులపాటు కురిసిన భారీ వర్షాలు తీరని నష్టాన్ని మిగిల్చాయి. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం భారీగా జరిగింది.
వేల ఎకరాల్లో పంట పోలాలు నీట మునిగాయి. భారీ ఎత్తున రోడ్లు, జాతీయ రహదారులు ధ్వంసం అయ్యాయి. పలు చోట్ల వంతెనలు కూలి పోయాయి. రాష్ట్రంలో సంభవించిన వరద నష్టాన్ని అంచనా వేసేందుకు వివిధ శాఖల అధికారులతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కమిటీ వేసింది.
Hyderabad : వామ్మో.. హైదరాబాద్‌లో మళ్లీ వర్షం, ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్
సోమవారం నుంచి కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటించి వరదల కారణంగా సంభవించిన నష్టాన్ని ప్రాథమికంగా అంచనా వేయనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నివేదికకు అదనంగా కేంద్ర ప్రభుత్వ అధికారుల బృందం నివేదిక ఇవ్వనుంది. అందుకనుగుణంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి నిధులను కేటాయించనుంది.