Nitin Gadkari : హైదరాబాద్‌‌కు గడ్కరీ.. సీఎం కేసీఆర్ హాజరుపై ఉత్కంఠ

ప్రోటోకాల్ ప్రకారం... NHAI అధికారులు సీఎం కేసీఆర్ కు ఆహ్వానం పంపారు. అయితే.. గడ్కరీ పాల్గొనే సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారా ? లేదా ? అనే ఉత్కంఠ నెలకొంది...

Gadkari

Nitin Gadkari Visit Hyderabad : హైదరాబాద్ కు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి రానున్నారు. రూ. 8 వేల కోట్ల హైవే పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా పాల్గొనున్నారు. ఈ సందర్భంగా శంషాబాద్ దగ్గర బీజేపీ సభ ఏర్పాటు చేసింది. ఇప్పటికే బీజేపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రి కిషన్ రెడ్డి అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. బహిరంగసభకు పది వేల మందిని తరలించాలని బీజేపీ నేతలు యోచిస్తున్నారు. హైదరాబాద్ – బెంగళూరు రహదారి 12 కిలోమీటర్ల పనులకు ఆయన శంకుస్థాపన చేయనన్నారు.

Read More : Nitin Gadkari : EV కంపెనీలకు మంత్రి గడ్కరీ హెచ్చరిక.. భద్రత లోపిస్తే భారీ మూల్యం తప్పదు..!

సంగారెడ్డి – నాందేడ్ – అకోల రహదారి 161ని శంషాబాద్ వద్ద గడ్కరి ప్రారంభిస్తారు. బోయినపల్లి – కండ్లకోయ వరకు ఆరు లేన్ల రహదారి విస్తరణ, అప్పా జంక్షన్ – మన్నెగూడ రహదారి పనులను ఆయన ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో.. ప్రోటోకాల్ ప్రకారం… NHAI అధికారులు సీఎం కేసీఆర్ కు ఆహ్వానం పంపారు. అయితే.. గడ్కరీ పాల్గొనే సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారా ? లేదా ? అనే ఉత్కంఠ నెలకొంది. మరోవైపు.. రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన మీటింగ్ ను పక్కన పెట్టి గడ్కరీ సభకు వెళుతానని ఎంపీ కోమటిరెడ్డి ఇప్పటికే వెల్లడించిన సంగతి తెలిసిందే.

Read More : Nitin Gadkari : రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స : మంత్రి నితిన్ గడ్కరీ

కేంద్ర ప్రభుత్వం విధానాలను సీఎం కేసీఆర్ ఎండగడుతున్న సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ ప్లీనరీలో ప్రధాన మంత్రి, కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. జాతీయస్థాయిలో ఉజ్వల పాత్ర పోషిస్తామని క్లారిటీ ఇచ్చేశారు. ఎవరినో గద్దె దించడానికో.. ఎక్కించడానికో కాదని.. గద్దెను ఎక్కించాల్సింది ప్రజలని కేసీఆర్ వెల్లడించారు. మారాల్సింది ప్రభుత్వాలు కాదు.. ప్రజల జీవనస్థితిగతులని స్పష్టం చేశారు. దేశ నిర్మాణానికి ఏది అవసరమో.. అదే కార్యచరణ కొనసాగుతుందని.. దేశం బాగుపడడానికి తెలంగాణ నుంచే జరిగితే అది గర్వకారణమన్నారు. మత విధ్వేషాలపై కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం గడ్కరీ పాల్గొనే సభకు సీఎం కేసీఆర్ హాజరవుతారా ? లేదా ? అనేది చూడాలి.