వాహనాల రిజిస్ట్రేషన్ మార్క్‌ను టీఎస్ నుంచి టీజీకి మార్చుతూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ

తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ల కోసం 'TS' స్థానంలో 'TG' ప్రిఫిక్స్‌ను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది .

Vehicle Registration

TS to TG in Telangana : తెలంగాణలో టీఎస్ స్థానంలో వాహనాల రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్ లకు టీజీ ప్రిఫిక్స్ ను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ మేరకు కేంద్ర రోడ్లు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ మంగళవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. మోటారు వాహనాల చట్టం 1988లోని సెక్షన్ 41(6) కింద ఉన్న అధికారాలను ఉపయోగించి 1989 జూన్ 12న అప్పటి ఉపరితల రవాణా శాఖ జారీచేసిన గెజిట్ నోటిఫికేషన్లో కేంద్రం మార్పు చేసింది.

Also Read : CM Revanth Reddy : మహాలక్ష్మి స్వశక్తి మహిళ పథకం ప్రారంభం.. కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేస్తాం : సీఎం రేవంత్‌రెడ్డి

గత నోటిఫికేషన్లోని టేబుల్లో సీరియల్ నంబర్ 29ఏ కింద తెలంగాణ రాష్ట్రానికి ఇదివరకు ఉన్న టీఎస్ స్థానంలో ఇప్పుడు టీజీ మార్క్ కేటాయించినట్లు కేంద్రం వెల్లడించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తరువాత వాహన రిజిస్ట్రేషన్ మార్క్ లో మార్పు చేయాలని రాష్ట్ర మంత్రివర్గంలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు వాహన రిజిస్ట్రేషన్ లో కేంద్ర ప్రభుత్వం మార్పు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇకనుంచి తెలంగాణలో రిజిస్ట్రేషన్ అయ్యే వాహనాల నెంబర్ ప్లేట్ లో టీఎస్ స్థానంలో టీజీ అని ఉండనుంది.

Also Read : CM Revanth Reddy : మళ్లీ ఢిల్లీకి సీఎం రేవంత్.. రెండో జాబితా ఎంపీ అభ్యర్థులపై అధిష్టానంతో చర్చ

వాహన దారులు ప్రస్తుతం ఉన్న వాహనాల నెంబర్ ప్లేట్లను ఎలాంటి మార్పు చేసుకోవాల్సిన పనిలేదని రవాణా శాఖ అధికారులు తెలిపారు. టీఎస్ నుంచి టీజీగా మార్చుతూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ రోజునుంచి ఎవరైతే కొత్త వాహనాలు కొంటారో.. వాటికి రిజిస్ట్రేషన్ సమయంలో టీజీ అని వస్తుందని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన తరువాత పాత వాహనాలకు నెంబర్ ప్లేట్ ను ఏపీ నుంచి టీఎస్ గా మార్చుకోవాల్సిన అవసరం రాలేదని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు కూడా అదే పద్దతిని కొనసాగించవచ్చునని రవాణాశాఖ అధికారులు చెప్పారు.

 

 

 

 

ట్రెండింగ్ వార్తలు