CM Revanth Reddy : మళ్లీ ఢిల్లీకి సీఎం రేవంత్.. రెండో జాబితా ఎంపీ అభ్యర్థులపై అధిష్టానంతో చర్చ
సామాజిక సమీకరణాలు ఆధారం చేసుకుని అభ్యర్థుల ఎంపిక ఉంటుందని తెలుస్తోంది.

CM Revanth Delhi Tour
CM Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మళ్లీ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఏఐసీసీ ఎన్నికల కమిటీ సమావేశానికి హాజరుకానున్నారు. రెండో జాబితా ఎంపీ అభ్యర్థులపై అధిష్టానంతో రేవంత్ చర్చలు జరపునున్నారు. ఇప్పటికే తెలంగాణలో 4 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది ఏఐసీసీ.
లోక్ సభ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ కీలకమైన సమావేశం జరగబోతోంది. తెలంగాణలో మొత్తం 17 పార్లమెంట్ స్థానాలు ఉండగా.. తొలి జాబితాలో నాలుగు స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్ హైకమాండ్. మహబూబ్ నగర్ నుంచి వంశీ చంద్ రెడ్డి, నల్గొండ నుంచి రఘువీర్ రెడ్డి, జహీరాబాద్ నుంచి జగదీశ్ షెట్కార్, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్ బరిలోకి దిగనున్నారు. ఇంకా 13స్థానాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికపై అభిప్రాయ సేకరణ చేస్తోంది కాంగ్రెస్ హైకమాండ్.
దీనికి సంబంధించి రేపు(మార్చి 13) సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం ఉంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు సీఎం రేవంత్ రెడ్డి రేపు సాయంత్రం ఢిల్లీ వెళ్లబోతున్నారు. 13 స్థానాలకు సంబంధించి అభ్యర్థులు ఎవరైతే బాగుంటుంది అనే దానిపై చర్చించనున్నారు. ఇప్పటికే కొంతమంది ఆశావహులు టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 17 స్థానాలకు సంబంధించి దాదాపు 309 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. సామాజిక సమీకరణాలు ఆధారం చేసుకుని అభ్యర్థుల ఎంపిక ఉంటుందని తెలుస్తోంది.
Also Read : త్వరలో కొత్త రేషన్ కార్డులు.. క్యాబినెట్ కీలక నిర్ణయాలు